MoviesTollywood news in telugu

సెలబ్రిటీల డాటర్స్ కి సక్సెస్ రాకపోవటానికి కారణాలు ఇవే

Tollywood Top heroes Daughters :తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల ఫ్యామిలీస్ నుండి వచ్చిన ఎంతోమంది హీరోలు సక్సెస్ తో స్టార్లుగా ఎదగడమే కాదు, ఆ టాప్ హీరోల కొడుకులు ఎంతోమంది స్టార్స్ అయ్యారు. అయితే వాళ్ళ కూతుర్లు మాత్రం నిలదొక్కుకోలేక పోయారు. దీనికి కారణం వాళ్ళ అభిమాని హీరో కూతురు వేరే హీరోలతో డాన్సులు చేయడం, సినిమాలు చేయడం ఫ్యాన్స్ కి నచ్చట్లేదట.అందుకే స్టార్ హీరో కూతుర్ల సినీ ప్రయాణం అంత కూడా మద్యలోనే ఆగిపోయింది. అక్కినేని నాగేశ్వరావు మనమరాలు నాగార్జున మేనకోడలైన సుప్రియ యార్లగడ్డ. మొదటి పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఈ సినిమా తర్వాత ఈమెకి అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మంచి సినిమాల్లో అదిరిపోయే పాత్రలలో నటిస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అప్పట్లో బాలకృష్ణతో ఒక సినిమా ఓకే కూడా అయింది. కానీ కృష్ణగారి అమ్మాయి కాబట్టి ఆమెని వేరేవాళ్ళ పక్కన వూహించుకోలేమంటూ ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆమె ఆశలు అడియాసలయ్యాయి.కానీ మంజుల కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది. యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ కు ఇద్దరు ముద్దుల కూతుర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటికే హీరోయిన్‌గా సత్తా చాటుతున్న శృతి హాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో ప్లాప్ లను చూసింది. ఇక కమల్ 2వ కూతురు అక్షరా హాసన్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఉపయోగం లేదు.

మెగా‌ ప్యామిలీ నుంచి డజనుకు పైగానే హీరోలు ఉన్నారు. వాళ్లంతా కొందరు దూసుకుపోతుంటే, కొందరు ఏదోలా నెట్టుకొస్తున్నారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికను మాత్రం ప్రేక్షకులు హీరోయిన్ గా ఆదరించలేదు. నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన కూడా ఆమెని హీరోయిన్ లా అంగీకరించలేక పోయారు. ఇక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్‌గా నటించక పోయినా, నటిగా మాత్రం మంచి సత్తా చాటుతోంది. ఎందుకో పూర్తి స్థాయిలో నటిగా ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నారు.

తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్‌గా సత్తా చాటాలని చూసినా కొన్ని సినిమాలు తర్వాత ఎందుకో హీరోయిన్ గా రాయించలేకపోయింది.ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో విలన్ గా, మంచి మంచి పవర్ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది. క్రాక్ లో కూడా రవితేజ ని డీ కొట్టింది. ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్ కు ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు హీరోయిన్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. కానీ తక్కువ సినిమాలే చేసారు.

యాక్షన్ కింగ్ అర్జున్ డాటర్ ఐశ్వర్యా కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా ఈమె విశాల్ హీరోగా నటించిన ధీరుడు అనే సినిమాతో పరిశ్రమలోకి అరంగేంట్రం చేసింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఈమెకి ఛాన్సులు రాలేదు. అలాగే హీరో రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక లను కూడా ప్రేక్షకులు హీరో రాజశేఖర్, జీవిత కూతుర్లుగానే చూస్తూ వీళ్ళని ఆదరించలేకపోతున్నారు. అయినా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు.