సొంత మరదళ్ళను పెళ్లాడిన స్టార్ హీరోలు…ఎంత మంది ఉన్నారో?

tollywood heroes married cousins : ఇలా లవ్ చేయడం, అలా పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు రాగానే విడాకుల తో బ్రేక్ అప్ చెప్పేయడం ప్రస్తుత కాలంలో కనిపిసున్న దృశ్యాలు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని సక్రమంగా జీవితాంతం హ్యాపీ ఉన్నవారు కూడా ఉన్నారు. కాకపోతే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇక గతంలో పెద్ద వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేసుకునే వాళ్ళు పెళ్ళయ్యాక ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం సాగించేవారు. ఒక్కసారి ఒకరికొకరు అర్థమయ్యాక ఆ బంధం లైఫ్ లాంగ్ కొనసాగడం తుదిశ్వాస వరకూ సంతోషంగా ఉన్న జంటలు ఎన్నో ఉన్నాయి.

ఇక మన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రేమ పెళ్లి అని పోకుండా వాళ్ళ కుటుంబంలోనే ఉన్న వారి మరదళ్ళను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు. వాళ్ళల్లో సీనియర్ ఎన్టీఆర్ ని మొదటగా చెప్పుకోవాలి. ఆయన తమ మామ కూతురు బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆయన పెళ్లప్పుడు ఎన్టీఆర్ ఆస్తులన్నీ కరిగిపోతాయని చెప్పినా సరే ఎన్టీఆర్ మీద ఇష్టంతోనే డబ్బుని ఆశించకుండా బసవతారకం ఆయన్ని పెళ్లాడారు.

అలాగే లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరావు కూడా తన మరదలైన అన్నపూర్ణమ్మని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు. అయితే మొదట్లో ఆ పెళ్ళికి అంగీకరించకుండా మారం చేసినా ఆ తరువాత ఒప్పించి పెద్దలందరు అతనికిచ్చి వివాహం చేశారు.అయితే పెళ్లయ్యాక వీళ్లిద్దరూ ఎంతో ఆదర్శప్రాయంగా జీవించారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా మరదలు ఇందిరమ్మతో ఒక్క చూపులోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో నటించేటప్పుడు హీరోయిన్ విజయనిర్మల ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే మొదటి భార్యను ఇందిరమ్మ ను కృష్ణ మాత్రం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటి భార్య లక్ష్మి చనిపోవడంతో పిల్లల కోసం ఆయన తన మరదలైన నిర్మల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు అన్యోన్య దాంపత్యంగా ఉంటున్నారు. సాయి కుమార్ నటనకు వారసుడిగా తెలుగు ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చిన ఆది పెళ్లాడింది కూడా తన సొంత మరదలినే. సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని హీరో ఆది పెళ్లి చేసుకున్నారు. వీరిది చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించిన పెళ్లట. వీరికి ఒక కుమార్త ఆయాన కూడా ఉంది. ఇక హీరో సూర్య తమ్ముడు కార్తీ యుగానికి ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, సూర్య లాగా లవ్ మ్యారేజ్ కాకుండా తన సొంత మరదలైన రజనీని పెద్దలు నిశ్చయంతో పెళ్లాడాడు. రజని ఎం ఏ లిటరేచర్ లో గోల్డ్ మెడలిస్ట్. వీరికి ఒక కుమార్తె ఉంది.