MoviesTollywood news in telugu

‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ స్టోరీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇదేనట

prema entha madhuram serial :మొదటినుంచి ఆడియన్స్ ఆదరణతో బుల్లితెరపై దూసుకెళ్తూ టిఆర్పి రేటింగ్ లో టాప్ లో నిలుస్తున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ జి తెలుగులోని అన్ని సీరియల్స్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. తెలుగు సీరియల్స్ లో టాప్ 5లో నిల్చింది. 45ఏళ్ళ వయస్సు గల బిజినెస్ మాన్ 19ఏళ్ళ తన సహ ఉద్యోగితో ప్రేమలో పడడం అనే లైన్ లో కొత్తగా ఈ సీరియల్ ఉండడంతో బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ మొదట మరాఠీలో స్టార్ట్ చేసిన జి ఛానల్ అక్కడ వచ్చిన భారీ రెస్పాన్స్ తో కన్నడ, మలయాళం, తమిళం లో ఎంటర్ చేసారు.

ఆతర్వాత తెలుగులో కూడా ప్రసారం చేయడంతో ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అన్ని భాషల్లో కూడా ఈ సీరియల్ హిట్ అవ్వడం విశేషం. ఆర్య వర్ధన్ ఉండే ఆఫీసు అతడిది కాదు. అతడు చాలా పేదవాడు. బాగా చదువుకోవడంతో మామూలు ఉద్యోగిగా చేరాడు. తర్వాత ఇదే కంపెనీ యజమాని కూతురు ఆర్యవర్ధన్ ని ప్రేమించింది. అయితే ఆర్య ప్రేమకు మొదట్లో ఒప్పుకోలేదు. అయితే యజమాని కూతురుని పెళ్లాడితే ఓనర్ అవ్వవచ్చన్న చెడు ఉద్దేశ్యం వస్తుంది. మొదటి భార్య రాజనందిని అతడి చేతిలో చనిపోతుంది.

మరాఠీలో ఆర్యకు ఇలా చెడుప్రవర్తన ఉన్నట్లు చూపించారు. ఫకీర్, బిచ్చగాడు, సోదెమ్మలకు రాజనందినిని ఆర్య చంపేసినట్లు తెలుసు. అందుకే బిచ్చగాడు ఎప్పుడూ ఆర్యను ప్రేమించవద్దని, మంచివాడు కాదని యజమాని కూతురు అనుకి చెబుతూ ఉంటాడు. ఫకీర్, సోదెమ్మ కూడా కోపంగానే ఉంటారు. కానీ ఆర్యవర్ధన్ కూడా ఆమెను ప్రేమించి, ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇక తనకి ఆనందం వచ్చినా, బాధ కలిగినా ఓ రూమ్ లోకి వెళ్లి షేర్ చేసుకుంటాడు.

ఆ రూమ్ లో మొదటి భార్య జ్ఞాపకాలు ఉంటాయి. ఇక ఆఫీసులో జరిగిన ఓ ఘటన విషయంలో ఆర్య మీద అనుకి అనుమానం రావడంతో ఆ రూమ్ కి వెళ్లి చూస్తుంది. అక్కడ డైరీ చదివి విషయం తెలుసుకుని, ఆర్య హంతకుడిగా ప్రూవ్ చేసి, జైలుకి పంపాలని అనుకుంటుంది. అయితే విషయం అనుకి తెల్సిందని తెల్సి, జరిగిన విషయం చెప్పి, అనుకి ప్రపోజ్ చేసి, బిల్డింగ్ మీదనుంచి దూకి చనిపోతాడు. ఇక అను కూడా ఆ కంపెనీ వదిలేసి , పద్దు దగ్గరకు వెళ్లి సొంతంగా బిజినెస్ చేసి, మంచి బిజినెస్ వుమెన్ గా నిలుస్తుంది. మరి ఈ సీరియల్ ని తెలుగులో ఎలా ముగిస్తారో చూడాలి

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."