MoviesTollywood news in telugu

త్రినయని సీరియల్ నటి శ్రీ సత్య ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా?

Trinayani serial actress sri satya :తెలుగులో వస్తున్న సీరియల్స్ కి బుల్లితెర ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముద్దమందారం , త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన శ్రీ సత్య తన అందంతో అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

విజయవాడలో జూన్ 9న జన్మించిన శ్రీ సత్య అక్కడే సిద్దార్ధ కాలేజీలో బిబిఎం పూర్తిచేసింది. చిన్నప్పటినుంచి నటనమీద ఆసక్తి ఉండడంతో మొదట్లో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది. తన అభిమాన నటుడు రామ్ అని చెబుతోంది. అయితే ఇటీవల జి తెలుగులో ప్రసారమైన సంక్రాంతి సంబరాలు ఈవెంట్ కి రామ్ రావడంతో శ్రీ సత్య ఆనందానికి అవధుల్లేవు.

అన్నట్టు నేను శైలజ మూవీలో హీరో రామ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా చిన్న రోల్ లో చేసిన శ్రీ సత్య ఆతర్వాత గోదావరి నవ్వింది అనే మూవీలో కూడా శ్రీ సత్య నటించింది. చిన్న నాటి నుంచి డాన్స్ అంటే మక్కువ కావడంతో డాన్స్ కూడా నేర్చుకుంది. మోడల్ గా చేస్తూనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ సత్య పలు యాడ్స్ లో చేసింది. లవ్ స్కెచ్, తరుణం, ఏ ఎన్ ఆర్ కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతా భ్రాంతియేనా వంటి షార్ట్ ఫిలిమ్స్ లో చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."