MoviesTollywood news in telugu

సంక్రాంతి సినిమాలలో ఏది సేఫ్ జోన్…ఏది డేంజర్ జోన్…?

Krack-Master-RED-Alludu Adhurs : రవితేజ క్రాక్ సంక్రాంతికి ముందే రిలీజ్ అయింది ఆ తర్వాత విజయ్ మాస్టర్, రామ్ రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో రవితేజ ముందుంటే బెల్లంకొండ చివర్లో ఉన్నాడు. మాస్టర్ సినిమా నెగెటివ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ నాలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం.

జనవరి 9న విడుదలైన రవితేజ క్రాక్ సినిమా 8 రోజుల్లో 24 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది

జనవరి 13న విడుదలైన విజయ్ మాస్టర్ సినిమా ఐదు రోజుల్లో 11.50 కోట్లను వసూలు చేసింది ఈ సినిమా తొమ్మిది కోట్ల బిజినెస్ చేసింది దాంతో సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.

జనవరి 14న విడుదలైన రెడ్ సినిమా నాలుగు రోజుల్లో 14 కోట్ల షేర్ని వసూలు చేసింది సేఫ్ జోన్ కి రావాలి అంటే 18 కోట్లు వసూలు చేయాలి

జనవరి 14న విడుదలైన అల్లుడు అదుర్స్ మొదటిరోజు 2.3 కోట్ల షేర్ వసూలు అయింది. నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు పరిస్థితి తారుమారైంది. ఈ నాలుగు సినిమాలలో డేంజర్ జోన్ లో ఉన్నది అల్లుడు అదుర్స్.