Tollywood:ఈ ఫోటోలోని బుడ్డోడు ఎవరో తెలుసా….టాలీవుడ్ స్టార్ హీరో గుర్తు పట్టారా…?
chiranjeevi childhood pics :టాలీవుడ్ లో ఎందరో హీరోలు వచ్చారు. ఒక్కొక్కరిదీ ఒక్కో బాణీ. ఎన్టీఆర్, అక్కినేని మొదలుకుని ఇప్పటి యంగ్ హీరోల వరకూ చాలామంది తమదైన నటనతో చెరగని ముద్రవేశారు. ఆరాధ్య దైవాలుగా ఫాన్స్ గుండెల్లో నిలిచిపోయారు.
అందులో ప్రధానంగా చెప్పాలంటే, పునాదిరాళ్ళు మూవీతో ఇండస్ట్రీలో పునాది వేసుకుని, స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి చెప్పి తీరాలి. తెలుగు చిత్రసీమలో భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన చిరంజీవి ని ఆదర్శంగా తీసుకుని ఎందరో ఇండస్ట్రీలోకి వచ్చారు.
అంతెందుకు మెగా ఫామిలీ లోనే దాదాపు పదిమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారంటే చిరంజీవి స్టామినా అయన వేసిన పునాది ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. డాన్స్ లు, ఫైట్స్, వెరైటీ స్టెప్స్ విషయంలో చిరంజీవిని చూసి ఫాలో అయినవాళ్లు, అవుతున్నవాళ్ళు చాలామంది యువ హీరోలున్నారు.
చిన్న పిల్లలు మొదలు ముసలి వాళ్ళ వరకూ అందరినీ అభిమానులుగా మలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డులు లెక్కనేనన్ని ఉన్నాయి. ఆఖరికి విలనిజాన్ని పండించడంలోనూ మెగాస్టార్ తర్వాతే ఏవేరైనా అని చెప్పక తప్పదు.
ఇక కష్టాల్లో ఉన్నవాళ్ళని ఆదుకునే వ్యక్తిత్వం గల చిరంజీవి నేత్ర దానం, రక్తదానం ప్రోత్సహిస్తూ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు పెట్టారు. ఇక లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అభిమానులకు మరింత దగ్గరయ్యారు.
తన లైఫ్ లోతల్లి, కొడుకు, కోడలు, అల్లుళ్ళు, కూతుళ్లు, మనవళ్లు , మానవరాళ్లతో జరిగిన చిన్న చిన్న ఘటనలు, క్యూట్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుని అభిమానులకు జోష్ నింపుతున్న చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ధైర్యం నూరిపోస్తూ యాడ్స్ లో కూడా చేసారు. ఇక తాజాగా తల్లిదండ్రులతో చాలా చిన్నప్పుడు దిగిన ఫోటోని షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.