Kitchenvantalu

Millet Curd Rice Recipe:కొర్రలతో పెరుగన్నం.. డయాబెటిక్‌ వారికి,బరువు తగ్గాలనుకోనేవారికి..

Millet Curd Rice Recipe:కొర్రలతో పెరుగన్నం.. డయాబెటిక్‌ వారికి,బరువు తగ్గాలనుకోనేవారికి.. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుండి బయట పడాలంటే ఇటువంటి ఆహారాలను తినాలి.

కావలసిన పదార్ధాలు
1 కప్పు కొర్రలు
2 ½ కప్పు నీరు
1/2 కప్పు పాలు
3 కప్పులు చిలికిన పెరుగు
1 కప్పు తురిమిన దోసకాయ
1 కప్పు తురిమిన క్యారెట్
3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ
తరిగిన3 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్
2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు
ఉప్పు రుచికి సరిపడా

తాలింపు కోసం
21/2 స్పూన్ నూనె
1 స్పూన్ ఆవాలు
2 స్పూన్ మినపప్పు
2 స్పూన్ శనగ పప్పు
2 ఎర్ర మిరపకాయలు
1/2 స్పూన్ ఇంగువ
2 టేబుల్ స్పూన్లు వేరుశెనగ
2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
6-7 కరివేపాకు రెబ్బలు

తయారి విధానం
కొర్రలను శుభ్రంగా కడిగి నీరు,పాలు పోసి ఉడికించాలి. దీనిలో తురిమిన దోసకాయ,క్యారెట్,ఉల్లిపాయ ముక్కలు,క్యాప్సికం ముక్కలు, పెరుగు,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

బాణలిలో కొంచెం నూనె తీసుకుని ఆవాలు వేయాలి. కొంచెం చిటపట వచ్చాక మినపప్పు,శనగ పప్పు,ఎండు మిరప,పచ్చిమిర్చి,వేరు శనగ,కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేగించాలి.

ఈ మిశ్రమాన్ని పైన తయారుచేసుకున్న కొర్రల పెరుగు మిశ్రమంలో కలపాలి. అంతే కొర్రల కర్డ్ రైస్ తయారు అయినట్టే..

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."