MoviesTollywood news in telugu

పవన్ రీ ఎంట్రీ ఖరీదు ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Pawan Kalyan remuneration :తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తానంటే సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉండే క్రేజ్ అలాంటిది. నిజానికి అజ్ఞాతవాసి సినిమా విడుదలైన తరువాత జనసేన పార్టీతో రాజకీయాల్లో బిజీ కావడంతో కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారు. అయితే పింక్ రీమేక్ గా దిల్ రాజు నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాతో పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అందుకే పవన్ గత సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా దాని ప్రభావం పవన్ రెమ్యునరేషన్ మీద పడకపోవడం విశేషం. ఇక పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ గా 50 కోట్ల రూపాయల నుంచి 55 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్టు టాక్.

మొత్తం పవన్ ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరు సినిమాలకు పవన్ కు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ రూపంలో దక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ మూవీ టీజర్ రిలీజై, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ పూర్తవ్వడంతో వకీల్ సాబ్ రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో పవన్ నటిస్తున్నారు. రీ ఎంట్రీలో పవన్ సినిమా సినిమాకు గ్యాప్ రాకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.

అందుకే వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కూడా ఈ ఏడాది రిలీజ్ చేస్తారని టాక్. గతంలో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా రాబోతోందని టాక్. అలాగే పవన్, చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వరుసగా సినిమాలకు కమిటవుతూ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేసేలా పవన్ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సన్నిహితుల నుంచి విన్పించే మాట.