ఆస్ట్రేలియాపై విజయం వెనుక రవిశాస్త్రి పాత్ర శూన్యం.. మొత్తం క్రెడిట్ రాహుల్ ద్రవిడ్ కే..

India wins in Australia :ఆస్ట్రేలియా పై భారత్ టెస్ట్ సిరీస్ ఘన విజయం వెనుక రవిశాస్త్రి పాత్ర శూన్యం.. క్రెడిట్ మొత్తం రాహుల్ ద్రవిడ్ కే..

అవును .. ఇది నిజం.. సిరీస్ ఆసాంతం 20 మంది క్రికెటర్లు తో ఆడింది టీమ్ ఇండియా.. కోహ్లీ లేడు.. ఆటగాళ్ళ గాయాలు..

ఇక ఆఖరి టెస్ట్ విషయానికి వచ్చేసరికి ఆస్ట్రేలియా తో ఆడింది.. ఒకరకంగా భారత్ – A జట్టు. అసలు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ ఓటమి మింగుడు పడక పోవడానికి కారణం.. ఈ భారత A జట్టు తో ఓటమి ఏమిటి.. అనే..

అసలు ఈ ఆఖరి టెస్ట్ లో రాణించిన శార్దూల్ ఠాకూర్ , వాషింగ్టన్ సుందర్, సిరాజ్ వగైరాలను తీర్చి దిద్ది.. భారత జట్టు లోకి ప్రవేశానికి కారణం రాహుల్ ద్రావిడ్.

ఆటతో పాటు మానసిక దృక్పథం లో కూడా రాటు దేల్చడం రాహుల్ ద్రావిడ్ ప్రత్యేకత.