అమెజాన్ అమ్మిన ఆవు పిడకలు రుచి అస్సలు బాలేదంట.. విదేశీయుడు రివ్యూ

amazon cow dung : విదేశాల్లో ఉండే భారతీయుల కోసం పండుగలు పూజలు నిమిత్తం అమెజాన్ online లో ఆవు పిడకలు ను.. కౌ డంగ్ కేక్స్.. అని ఇంగ్లీష్ పేరు తో అమ్ముతుంది.

అయితే వీటిని ఎలా వాడాలో భారతీయులు కు మాత్రమే అవగాహన ఉంది. ఆవు పిడకలు ను కౌ డాంగ్ కేక్స్ అనేసరికి ఒక విదేశీయుడు అవి తినే cakes అనుకుని.. online లో కొని.. తిన్నాడు.. అస్సలు నచ్చలేదు రుచి అతనికి. అంతే product review రాసి పడేశాడు.. ఇదేం రుచి అస్సలు బాలేదు. మట్టి, గడ్డి.. శుభ్రత కూడా లేదు. Crunchy గా కూడా లేవు.

కాస్త శుభ్రత పాటిస్తూ, tasty గా crunchy గా చేయండి.. ఈ సారి .. అని చిరాకు పడుతూ product review రాసేసాడు.

అంతే ఈ రివ్యూ చూసిన వారంతా షాక్ తిన్నారు. ఇంతకీ description లో వీటిని దేనికోసం ఎలా వాడుతారు అనేది రాసినప్పటికీ దానిని చదవలేదు అతగాడు.

ఆ రివ్యూ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కు బోలెడు పని చెప్పింది జోకులకు.