ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు

prabhas marriage : టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రభాస్. ప్రభాస్ పెళ్లి గురించి చాలా రోజులుగా ఎన్నో వార్తలు వస్తున్న పెళ్లి వార్త మాత్రం ప్రభాస్ చెప్పటం లేదు. ప్రభాస్ తోటి స్టార్స్ అందరికీ ఇంచుమించు పెళ్లిళ్లు అయ్యిపోయాయి.

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి గురించి ప్రభాస్ ఏమి చెప్పలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. ఈ 4 సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. వీటిల్లో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి కాగా,

సలార్ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, ఫిబ్రవరి తొలి వారం నుంచి ఆదిపురుష్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. నాగ్ అశ్విన్ తో సినిమా ఈ సంవత్సరం మధ్యలో ప్రారంభం అవుతుందట. ఇలా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక చానల్ కి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు కాస్త సీరియస్ అయి అయినప్పుడు ప్రభాస్ పెళ్లి అవుతుందని కృష్ణంరాజు పేర్కొన్నారు. అభిమానులతో పాటు నేను కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్న అని చెప్పారు.