పూజా హెగ్డే తొలి సంపాదన తెలిస్తే షాకవ్వాల్సిందే…ఏమి చేసిందో తెలుసా?

Pooja Hegde first remuneration :గతేడాది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస అవకాశాలతో హిట్ మీద హిట్ అందుకుంటోంది. ఇంచుమించు అందరు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. స్టార్ హీరోయిన్ గా డిమాండ్ పెరిగే కొద్దీ, రెమ్యునరేషన్ కూడా పెంచేస్తుంటారు. వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. అయితే ఈ బ్యూటీ తొలి సినిమా సంపాదనతోనే కారు కొందట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి సంపాదన, సినిమా ఛాన్స్ వంటి విషయాలపై సంచలన విషయాలను షేర్ చేసుకుంది.

కాలిగ్రఫీ నేర్చుకున్న పూజా హెగ్డే చేతి రాత అందంగా ఉండేది. ఆమె తాతయ్య కోరిక మేరకు పూజా ముంబై అథ్లెటిక్ అసోసియేషన్ లో పాల్గొని అక్కడ విద్యార్థుల పేర్లను అందంగా రాసి ఆమె 200 రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంది. అలా 200 రూపాయలు సంపా దించడంతో లాటరీ తగిలినంత ఆనందం కలిగిందని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. అయితే తనకు చిన్నతనంలో సిగ్గు ఎక్కువగా ఉండేదని, పబ్లిక్ ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొనడం ద్వారా సిగ్గును అధిగమించాలని భావించి, కెరీర్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వచ్చింది.

మిస్ యూనివర్స్ పోటీలలో పూజా హెగ్డే సెకండ్ రన్నరప్ గా నిలవడంతో ఆమెకు యాడ్స్ లో నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదట్లో యాడ్ కోసం రూ 3 వేలందుకున్న పూజా ఆ తరువాత మిస్ యూనివర్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిల్చింది. రణబీర్ కపూర్ తో ఒక యాడ్ లో కలిసి నటించడం తన జీవితాన్ని మలుపు తిప్పిందని, నిజానికి మొహంజోదారో మూవీలో ఛాన్స్ రావడానికి కూడా ఆ యాడ్ కారణమని ఆమె వివరించింది. ఆ మూవీ ఆశించిన విజయాన్ని దక్కించుకోకపోయినా పూజా హెగ్డే ఆతర్వాత వరుస ఛాన్స్ లతో బిజీ హీరోయిన్ గా సక్సెసయింది.