MoviesTollywood news in telugu

బంగారు బుల్లోడు మూవీ హిట్టా.. ఫ్లాపా..?

Bangaru Bullodu movie review :పీవీ గిరి దర్శకత్వంలో అల్లరి నరేశ్, పూజా జవేరి జంటగా నటించిన బంగారు బుల్లోడు సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ తో ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరుచుకున్న అల్లరి నరేశ్ ఈ మధ్య కాలంలో సరిన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. రొటీన్ కామెడీని ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడటం లేదు. బంగారు బుల్లోడు సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అల్లరి నరేశ్ అభిమానులకు నచ్చుతుంది. కానీ సాదారణ ప్రేక్షకులకు పెద్దగా నచ్చదని అంటున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ అప్పులు ఇచ్చే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించాడు. సీతానగరంలో అందరికీ పెళ్లిళ్లు అవుతున్నా అల్లరి నరేశ్ కి అతని సోదరులకు మాత్రం పెళ్లి అవ్వడు. భవాని ప్రసాద్ తాత చేసిన పనికి వీరికి పెళ్లిళ్లు కావటం లేదని తెలుస్తుంది.

అసలు అమ్మవారి నాగాలకు భవాని ప్రసాద్ కుటుంబానికి సంబందం ఏమిటో… తాత చేసిన తప్పును భవాని ప్రసాద్ సరిదిద్దాడా అనే సినిమా కథతో తెరకెక్కింది. రొటీన్ కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు మైనస్ గా మారాయి.కైమాక్స్ బాగానే ఉన్నప్పటికీ మిగిలిన సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటే సినిమా హిట్ అయ్యేది.