MoviesTollywood news in telugu

గీతాంజలి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ టాప్ హీరోయిన్…ఎవరో చూడండి

Geethanjali movie child artist : అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్ లో విక్రమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు మణిరత్నం తీసిన గీతాంజలి సినిమా క్లాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమా మాస్ ఆడియన్స్ కు దగ్గర చేయడమే కాదు, టాలీవుడ్ లో శివ ట్రెండ్ సెట్టర్ అయింది. శివకు ముందే గీతాంజలి సినిమాతో నాగ్ తెలుగు ఆడియన్స్ మనస్సులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. డైరెక్టర్ మణిరత్నంకి కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఇక ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అద్భుతమైన మెలోడీ సాంగ్స్ యూత్ ని ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా తమిళ్, మలయాళ భాషల్లో డబ్ సీఏయడంతో అక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ గా అయింది. ఇంతగా పేరొచ్చిన ఈ సినిమాను హిందీలో “యాద్ రకేగీ దునియా” పేరుతో రీమేక్ చేయడంతో అక్కడా హిట్ కొట్టింది. గీతాంజలి అంతగా హిట్ కావడానికి మరో ముఖ్యమైన అంశం హీరోయిన్ గిరిజ. తన అద్భుత నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డుని దక్కించుకుంది. బెస్ట్ డైరెక్టర్ గా మణిరత్నంకు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు, బెస్ట్ స్టోరీ రైటర్ గా నంది అవార్డు తెచ్చిపెట్టింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక నంది అవార్డు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా పి.సి.శ్రీరామ్ కు నంది అవార్డు దక్కింది.
Geethanjali movie child artist
ఇవన్నీ ఒక ఎత్తయితే ఓ చైల్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించింది. హీరోయిన్ గిరిజ చెల్లిగా నటించిన ఆమె పేరు నీనా పిళ్లై. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో నాగార్జున, గిరిజల ప్రేమకు సపోర్ట్ చేసే పాత్రలో ఒదిగిపోయింది. ఈమె మాట్లాడే మాటలు, ఆమె చేసే పనులు బాగా రక్తికట్టించాయి. ఇంతకీ ఈ చైల్డ్ ఆర్టిస్ట్ లైఫ్ గురించి చూస్తే, 1982 అక్టోబర్ 2 న చెన్నైలో రాజన్, రాహిని దంపతులకు జన్మించింది. ఆరేళ్లకే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చేసి, గీతాంజలి తర్వాత తమిళ సినిమాలకే పరిమితమయింది. పలు టి‌వి సీరియల్స్ లో కూడా నటించింది. కెలడి కన్మని, కాలమెల్లం కాతిరుప్పెన్, రాశి వంటి తమిళ సినిమాల్లో నటించిన ఈమె నటనకి ముగ్దులై దర్శక, నిర్మాతలు హీరోయిన్ గా ఆఫర్లు ఇస్తే, వదిలేసింది. అయితే 1997 లో కె.బాలచందర్ నిర్మాతగా వచ్చిన విడుకథై సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ రావడంతో ఒకే చెప్పి, ఆ మూవీలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.