MoviesTollywood news in telugu

డైరెక్టర్ తేజ కొడుకు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Director teja Son : టాలీవుడ్ లో ఒకదశలో ట్రెండ్ సెట్టర్ సినిమాగా ఉషా కిరణ్ మూవీస్ వారి ‘చిత్రం’ మూవీ నిల్చింది. ఈ మూవీతో డైరెక్టర్ తేజ దర్శకునిగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. హీరోగా ఉదయ్ కిరణ్ కి మంచి పేరుతెచ్చింది. అయితే తేజ చిన్నతనంలో పడ్డ కష్టాలు ఏ డైరెక్టర్ పడలేదు. సినిమాల్లోకి రాక ముందు తినడానికి తిండి కూడా సరిగా లేక ఎన్నో కష్టాలు పడిన తేజ 1995 సమయంలో రామ్ గోపాల్ వర్మ దగ్గర సినిమాటోగ్రాఫర్ గా పని చేసాడు. సరిగ్గా అప్పుడే ఆయనకు శ్రీవల్లి అనే అమ్మాయితో పెళ్ళి ,వెంట వెంటనే ఇద్దరు పిల్లలకి జన్మనివ్వడం చకచకా సాగిపోయింది. తేజ వాళ్ళ అబ్బాయి అమితవ్ 1995లో ముంబైలోనే జన్మించాడు. కెమెరామన్ గానే తన లైఫ్ సాగిస్తూ డైరెక్షన్ అవకాశం కోసం చూస్తున్న తేజ పనితనం రామోజీ రావుకి నచ్చడం, చిత్రం సినిమాకి డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వడం, ఈ మూవీ 2000లో విడుదలయ్యి, సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది.

అంతేకాదు, మొదటి చిత్రంలోనే తన కొడుకు అమితవ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసాడు. సినిమా హిట్ అవ్వడం, డైరెక్టర్ గా మంచి పేరు రావడంతో ఇక పూర్తిస్థాయిలో డైరెక్టర్ గా కొనసాగాలని తేజ భావించి, కొడుకు అమితవ్ కి రెండేళ్ల వయసున్నప్పుడు జూబ్లీహిల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. ‘పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, మంచి చదవు, జ్ఞానం ఇస్తే చాలు వాళ్ళే బతికేస్తారు’ అని నమ్మే తేజ పిల్లల్ని బాగా చదవించాడు. ముఖ్యంగా అమితవ్ ని ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ హైదరాబాద్ లో జాయిన్ చేసాడు.

అక్కడ బాగా చదువుతో పాటు అమితవ్ బాక్సింగ్ పై కూడా మంచి పట్టు సాధించాడు. అంతేకాదు, సినిమాలపై ఉన్న ఇష్టంతో అటు స్టడీస్ చేస్తూనే, మహేష్ బాబు నటించిన నిజం సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అలాగే డైరెక్టర్ కృష్ణ వంశి తీసిన గోవిందుడు అందరివాడేలే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. సినిమా రంగం గురించి మరింత తెలుసుకుని ఈ ఫీల్డ్ లోనే రాణించాలని కాలిఫోర్నియా వెళ్లి ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్ కోసం చేరాడు. కానీ మొదటి సెమిస్టరు వరకు చేసి, ఆ తర్వాత యాక్టింగ్ కోసం న్యూయార్క్ వెళ్లి, ‘లీ స్టార్స్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్సిటిట్యూట్’ లో ఫుల్ టైం శిక్షణ పొందాడు.

తండ్రి వారసత్వంగా ఇటీవలే ఒక షార్ట్ ఫిలింకి కూడా డైరెక్షన్ చేసిన అమితవ్ ప్రస్తుతం తండ్రి స్థాపించిన సామాజ్యం మోషన్ పిక్చర్ ఎక్సిబిషన్ కంపెనీ కి, జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి, చిత్రం మూవీస్ సంస్థ కి సీఈఓ గా ఇటీవలే సారధ్యం వహించాడు. ఇక సినీ ఛాన్స్ కోసం చూస్తున్న తరుణంలో ఇటీవలే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అమితవ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రకటించినా, అది కొన్ని కారణాల వలన డ్రాప్ అయింది.

అయితే తేజ అబ్బాయి కనుక మంచి స్టోరీ దొరకడానికి పెద్ద టైం పట్టకపోవచ్చని, అందుకే అతి త్వరలో అమితవ్ ని హీరోగా చూసే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నో హిట్ సినిమాలే కాదు, ఫ్లాప్ సినిమాలు కూడా తేజ ఖాతాలో ఉన్నాయి. నచ్చకపోతే ఏదీ చేయని మనస్తత్వం గల తేజ గతంలో ఎన్టీఆర్ బయోపిక్ నుంచి కూడా తప్పుకున్నాడు.