MoviesTollywood news in telugu

30 రోజుల్లో ప్రేమించడం ఎలా… ట్విట్టర్ రివ్యూ…ఎలా ఉందంటే…

30 Rojullo Preminchadam Ela Movie Review :యాంకర్ ప్రదీప్ అంటే తెలియని తెలుగు వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే బుల్లితెర ప్రేక్షకులకు ప్రదీప్ సుపరిచితమే. టాప్ షోలకు యాంకరింగ్ చేస్తూ ఆదరకొట్టేస్తున్నాడు. ఇప్పుడు బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా విడుదల కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ తమిళ భామ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట దాదాపుగా ఏడు నెలల నుంచి ట్రెండ్ అవుతూనే ఉంది

ఇప్పటికే 223 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న ఈ పాటతో వచ్చిన ఆదాయంతో సినిమా సగం బడ్జెట్ రికవరీ అయ్యి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ పాటతో వచ్చిన ఆదాయం సినిమా బడ్జెట్ లో సగానికి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇక సినిమా విషయానికి వస్తే మిశ్రమ స్పందన కనపడుతుంది. కొంత మంది బోరింగ్ లవ్ స్టోరీ అని అంటున్నారు. మరి కొంతమంది పర్వాలేదని అంటున్నారు. సినిమాలో పాజిటివ్ అంశాల విషయానికి వస్తే సినిమాలో పాటలు,హీరోయిన్ అమృత అయ్యర్ అని అంటున్నారు.

ఇక నెగిటివ్ అంశాల విషయానికి వస్తే సినిమా సాగతీత,స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అని అంటున్నారు.