స్టార్ కమెడియన్ పిక్ వైరల్…గుర్తు పట్టారా…?
Comedian Kapil Sharma :గతంలో సినిమా వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే, సినిమా వారపత్రికలో, మ్యాగజైన్స్ చదవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేగంగా ఉండడంతో ఇంచుమించు అందరికీ ఖాతాలున్నాయి. చిన్నప్పటి ఫోటోలు మొదలుకుని అరుదైన ఫోటోలు , విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. అయితే హీరోహీరోయిన్లు, సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలను చూస్తే, అవే పోలికలతో ఉండడం వలన ఈజీగా గుర్తుపడతాం. కానీకొందరు సెలబ్రిటీలను అసలు గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది.
ఇక బాగా పరిచయం ఉన్న స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఫోటో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, ఎక్కువ మంది గుర్తు పట్టలేకపోతున్నారు. దీనికి కారణం 11 ఏళ్ల వయస్సులో ఫోటో 28 సంవత్సరాల క్రితం దిగిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. ఇంతకీ కపిల్ శర్మ ఎవరంటే, బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ గా గుర్తింపు పొందాడు. కిస్ కిస్కో ప్యార్ కరూన్ సినిమాతో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి, నటుడిగా, యాంకర్ గా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్నాడు.
2008లో వ్యాఖ్యాతగా కెరీర్ ను మొదలుపెట్టిన కపిల్ శర్మ ఇప్పటికీ వరుస ఛాన్స్ లతో బిజీ అయ్యాడు. కామెడీ నైట్స్ విత్ కపుల్ షో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక 2016 సంవత్సరం నుంచి కంటిన్యూ గా “ది కపిల్ శర్మ” అనే షో వస్తోంది. దీనికి యాంకర్ గా కపిల్ శర్మ వ్యవహరిస్తుండగా, ఆడియన్స్ నుంచి ఈ షో కి మంచి ఆదరణ లభిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఈ షో కొన్ని వారాల పాటు స్టాప్ కానుందని టాక్. ఎందుకంటే, కపిల్ శర్మ కొంతకాలం పాటు షోకు బ్రేక్ ఇచ్చారని అంటున్నారు అయితే షో ఎండ్ కాలేదని, షోకు తాత్కాలికంగా బ్రేక్ మాత్రమే పడిందని వివరించాడు.కుటుంబంతో గడపటానికి బ్రేక్ ఇచ్చాడు.