బన్నీ సరసన టాప్ విలన్ కూతురు…ప్లాన్ అదిరింది

Allu arjun New Movie :టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ అనగానే రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వీటిని ఫుల్ ఫిల్ చేయడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఒక సినిమా రూపొందనున్న నేపథ్యంలో ఈ మూవీపై అంచనాలు అందనంత ఎత్తులో ఉన్నాయి. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ ‘పుష్ప’ చేస్తున్నాడు. ఇందులో రష్మిక మందన హీరోయిన్. ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ చిత్రం బన్నీ చేయాలి.

అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా బన్నీ ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక బన్నీ, కొరటాల కాంబోలో చిత్రం సెట్స్ మీదికి వస్తుంది. బన్నీ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ నటించబోతున్నట్లు టాక్. అయితే, దీనిపై ఇంకా క్లారిటీ లేదు. సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ ద్వారా సయీ మంజ్రేకర్ బాలీవుడ్‌కు పరిచయమైంది. ఈమె ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత మహేష్ మంజ్రేకర్ కుమార్తె.

ఇక మహేష్ మంజ్రేకర్ ‘ఒక్కడున్నాడు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి,…. . ‘అదుర్స్’, ‘డాన్ శీను’, ‘అఖిల్’, ‘వినయ విధేయ రామ’ వంటి చిత్రాల్లో విలన్‌గా మెప్పించాడు. వీటిల్లో ‘ఒక్కడున్నాడు’, ‘అదుర్స్’ సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. సయీ మంజ్రేకర్ ఇప్పటికే . ‘మేజర్’ సినిమాలో అడివి శేష్ సరసన నటిస్తోంది. అల్లు అర్జున్‌కు ఆమె హీరోయిన్‌గా నటించడం నిజమే అయితే ఇది ఆమె రెండో తెలుగు సినిమా అవుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ పాన్ ఇండియా సినిమా గురించి ఇతర వివరాలేవీ క్లారిటీ ఇవ్వకపోయినా హీరోయిన్ గురించి విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.