ఆదిపురుష్ లో ప్రభాస్ తల్లిగా స్టార్ హీరోయిన్…ఆమె ఎవరో తెలుసా?

Prabhas Adipurush Movie :‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాలన్నీ ప్యాన్‌ ఇండియా మూవీస్ అవుతున్నాయి. ఇక తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ‌ దర్శకత్వం వహించనున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ చేస్తున్నాడు.

టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయాలనీ కూడా డేట్ ఫిక్స్ చేసిన ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ చూస్తుంటే ఫాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని అంటున్నారు. ఈ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం అవతార్, స్టార్ వార్స్ ఫేమ్ స్పెషలిస్టులను నిర్మాతలు ఇప్పటికే సంప్రదించారట. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ మూవీలో సీనియర్‌ నటి, ఎంపీ హేమమాలిని ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్‌. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషిస్తుంటే, రాముడి త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో హేమమాలి‌ని కనిపించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఈ సినిమా మోషన్ క్యాప్చర్ మొదలైందనిదర్శకుడు ఓం రౌత్ ప్రకటించాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా ప్రభాస్ పోస్ట్ చేశాడు. ఈరోజు మోషన్ క్యాప్చర్ మొదలైంది. ఇక ఫిబ్రవరి 2న ముహూర్తం అని తెలిపాడు. ఈ మూవీలో ప్రభాస్ సోదరుడు అంటే రామునికి లక్ష్మణుడి పాత్రను ఎవరు చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో పుకార్లు షికారు చేస్తున్నాయి.

బాలీవుడ్ కు చెందిన యువ నటుడు సన్నీ సింగ్ పేరు వినిపిస్తుంది. “సోను కె టిటు కి స్వీటీ” అనే చిత్రంలో కనిపించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రభాస్‌కు తమ్ముడిగా నటిస్తాడని మొన్నటి వరకు టాక్ వినిపిస్తే, తాజాగా టైగర్ ష్రాఫ్ నటించనున్నాడని టాక్ వస్తోంది.