MoviesTollywood news in telugu

మాస్ మహారాజ్ ఫ్యాన్స్ పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్…కారణం ఇదే

Bala Krishna and Raviteja :హీరోల మధ్య గొడవలు ఉండవు కానీ, ఫాన్స్ వలన కొన్నిసార్లు లేనిపోని ఇబ్బందులు వచ్చేస్తాయి. ముఖ్యంగా తమ అభిమాన హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజైతే ఇక ఒకరిని మించి మరొకరు హంగామా చేసేస్తారు. రేటింగ్స్, కలెక్షన్స్, రివ్యూస్ కూడా రాసేస్తుంటారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ మూడు సార్లు తమ సినిమాలతో పోటీకి దిగారు. బాలయ్య, బోయపాటి కాంబోలో సినిమా డేట్ ప్రకటించాక బాలయ్య, రవితేజ సినిమాల టాపిక్ మరోసారి చర్చకు దారితీసింది. మే 28ఎన్టీఆర్ జయంతికి బాలయ్య మూవీ రిలీజ్ డేట్ ఇవ్వగా, అదేరోజు రవితేజ ఖిలాడీతో రాబోతున్నాడట.

గతంలోకి వెళ్తే, 2008జనవరి 11న భారీ అంచనాల మధ్య ఒక్క మగాడితో బాలయ్య రావడం డిజాస్టర్ కావడం అయింది. అయితే ఇక ఒకరోజు తేడాతో వివి వినాయక్ డైరెక్షన్ లో రవితేజ మూవీ కృష్ణ రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టేసింది. 2009 న బాలయ్య మిత్రుడు మూవీ రిలీజయింది. మొదటివారానికే ప్లేఆఫ్ టాక్ తో వెనక్కి వెళ్ళిపోయింది. ఇక వారం తిరక్కుండానే సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో రవితేజా కిక్ మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. 2011జనవరి దాసరి నారాయణరావు డైరెక్షన్ లో బాలయ్య నటించిన పరమవీరచక్ర మూవీ రిలీజై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి బాలయ్య ఫాన్స్ కి కూడా నచ్చలేదు.

అదేరోజు హరీష్ శంకర్ డైరెక్షన్ లో రవితేజ మిరపకాయ్ రిలీజై, సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూడుసార్లు బాలయ్య , రవితేజ లలో రవితేజ పైచేయిగా నిలిచాడు. ఇప్పుడు మరోసారి బాలయ్య, రవితేజ బిబి 3, ఖిలాడీ రూపంలో తలపడుతున్నారు. అసలు బాలయ్యకు, రవితేజకు పోటీ ఏంటి అని కొందరు ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పోటీ ఇస్తూ చరిత్ర తిరగరాసిన చరిత్ర బాలయ్యకు ఉందన్న విషయం అందరూ గమనించాలని అంటున్నారు. బాలయ్య మార్క్ మూవీస్ ముందు రవితేజా సత్తా సరిపోదని , ఎవరి రేంజ్ వారిదేనని ఫాన్స్ అంటున్నారు. పైగా బాలయ్య , బోయపాటి కాంబోలో వచ్చే సినిమా ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫాన్స్ గట్టిగా చెబుతున్నారు.