MoviesTollywood news in telugu

కల్యాణ వైభోగం సీరియల్ మేఘన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

kalyana vaibhogam serial :జి తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న కల్యాణ వైభోగం సీరియల్ విశేష ప్రేక్షకాదరణతో సూపర్ హిట్ గా సాగుతోంది. హీరోగా సన్నీ, హీరోయిన్ గా మేఘనా లోకేష్ నటిస్తున్నారు. నిత్యా, మంగ పాత్రలో మేఘన ద్విపాత్రాభినయం చేస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నిజానికి మేఘన కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడ్డం వలన కన్నడ అమ్మాయా అని డౌట్ వస్తూ ఉంటుంది. 2013లో శశిరేఖా పరిణయం సీరియల్ ద్వారా మేఘన పరిచయం అయింది. కల్యాణ వైభోగం , రక్త సంబంధం సీరియల్స్ తో బిజీగా ఉంది.

కల్యాణ వైభోగం సీరియల్ కి మేఘన ఎంతటి పారితోషికం అందుకుంటుందో తెలిస్తే షాకవుతారు. కళ్యాణ వైభోగంతో పాటు రక్తసంబంధం సీరియల్స్ కి ఒక్కో ఎపిసోడ్ కి 15వేలనుంచి 18వేల చొప్పున అందుకుంటోంది.