MoviesTollywood news in telugu

30 ప్లస్ వచ్చినా ఈ బ్యాచిలర్స్ పెళ్లి ఊసేలేదు…ఎందుకో తెలుసా?

Small Screen Celebrities :పూర్వం పెళ్లంటే 12ఏళ్లకే చేసేసేవారు, తరువాత 16ఏళ్లకు, ఆతర్వాత 18ఏళ్లకు, ఇక ఇప్పుడు 30ఏళ్ళు వచ్చినా ఇంకా కొందరు బ్యాచిలర్స్ గానే ఉంటున్నారు. ర్యాప‌ర్‌, సింగ‌ర్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్‌, బిగ్‌బాస్ 3లో పాల్గొని, విన్న‌ర్‌గా నిలిచాడు. ఆ త‌రువాత అత‌డికి ఛాన్స్ లు కూడా వ‌స్తున్నాయి. అయితే 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి ప్రస్తావన లేదు. మొగ‌లిరేకులు, వ‌రూధిని ప‌రిణ‌యం, ఆమె క‌థ వంటి సీరియ‌ళ్ల‌లో నటించి బుల్లితెర‌పై హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ర‌వికృష్ణ బిగ్‌బాస్ 3లోనూ పాల్గొన్నాడు. అయితే 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసేలేదు. ఇటీవ‌ల ఓ షోలో అత‌డి త‌ల్లిదండ్రులు స్పందిస్తూ, ఈ ఏడాది ర‌వికృష్ణ పెళ్లి చేస్తామ‌ని అన్నారు.

తెలుగు బుల్లితెర‌పై అంద‌మైన యాంక‌ర్ల‌లో ర‌ష్మి గౌత‌మ్ 30 ఏళ్లు దాటినా రష్మి పెళ్లి గురించి ఆలోచించ‌డం లేదు. కెరీర్ ప్రారంభంలో తెలుగు స‌రిగా రాక‌పోయినా త‌న అందంతో షోల‌ను నడిపించింది. ఆ త‌రువాత తెలుగు నేర్చుకుంటూ, మ‌ధ్య మ‌ధ్య‌లో ప‌లు సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. యాంక‌ర్‌గా ర‌ష్మికి మంచి క్రేజ్ ఉంది.

అయితే ఇప్ప‌టికీ త‌న కెరీర్ మీద‌నే ఫోక‌స్ పెట్టిన‌ట్లు ఈ మ‌ధ్య‌న కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మి చెప్పడం విశేషం.ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుడిగాలి సుధీర్.. ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించు కున్నాడు. ఇక ప‌లు సినిమాల్లోనూ న‌టించి, హీరోగా నిల‌దొక్కుకునేందుకు త‌న ప్ర‌యత్నాల‌ను చేస్తూనే ఉన్నాడు. కాగా ఈ న‌టుడికి కూడా 30 ఏళ్లు వ‌చ్చినా పెళ్లి గురించి ఆలోచించ‌లేదు. కాగా బుల్లితెర‌పై సుధీర్- ర‌ష్మి జోడీకి మంచి క్రేజ్ ఉండ‌గా.. వీరిద్ద‌రి పెళ్లి కోసం వారిద్ద‌రి అభిమానులు ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ అదంతా స్క్రీన్ వ‌ర‌కేన‌ని నిజ జీవితంలో తామిద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని అంటున్నారు.

బుల్లితెర‌పై క్రేజ్‌ గల యాంక‌ర్ ప్ర‌దీప్ త‌న మాట‌లు, హాస్య చాతుర్యంతో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సుమ త‌రువాత అంత‌టి యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న యితడు నటించిన 30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా మూవీ ఇటీవలే రిలీజయింది. హీరోగా కూడా సత్తా చాటాడు. ఇలా బుల్లితెర‌, వెండితెర రెండింటిలో బిజీగా గ‌డిపేస్తున్నాడే గానీ 35 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి మాత్రం ఆలోచించ‌డం లేదు. తాజాగా ఈ ఏడాది కూడా త‌న పెళ్లి ఉండ‌ద‌ని ప్ర‌దీప్ తేల్చేసాడు.

కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సీరియ‌ల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న హిమ‌జ‌.. ఆ త‌రువాత సినిమాల్లో, అనంతరం బిగ్‌బాస్ 3లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇప్పుడు ప‌లు సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తున్న ఈ అమ్మడు 30 ఏళ్లు నిండినా పెళ్లి ఊసెత్తడం లేదు. అలాగే న‌టి రోహిణి. కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం సీరియ‌ల్ ద్వారా పాపులారిటీని తెచ్చుకుని, ఆ త‌రువాత పలు సీరియల్స్ లో చేసి, బిగ్ బాస్ 3లోనూ కంటెస్టెంట్‌గా చేరింది. మ‌ల్టీ టాలెంటెడ్‌గా పేరొంది, ప్ర‌స్తుతం ప‌లు షోల‌లో రోహిణి త‌న హ‌వాను చాటుతున్నా,పెళ్లి గురించి ప్రస్తావన లేదు.