MoviesTollywood news in telugu

మెగాడాటర్ ‘వెబ్ సిరీస్’ బడ్జెట్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాలసిందే

Megadaughtar web series budget :కరోనా లాక్ డౌన్ టైంలో అన్ని రంగాలు మూతపడి అందరూ ఇళ్లకే పరిమితం కావడం వలన జనం ఓటిటిలలో సినిమాలు, వెబ్ సిరీస్ లకు బాగా అలవాటు పడ్డారు. ఓరకంగా లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా హాట్ స్టార్ లాంటి ఓటిటిలు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఇక కొత్తకొత్త ఓటిటిలు కూడా ఎన్నో పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ లను తీసే మేకర్స్ కూడా వందలలో రెడీ అయిపోయారు. అయితే వెబ్ సిరీస్ లలో అన్ని ఇండస్ట్రీలలో కొత్తవారి దగ్గర నుండి స్టార్ హీరోలు హీరోయి న్స్ వరకు అంతా ఓటిటిలలో పనిచేస్తున్నారు.

అయితే టాలీవుడ్ లో ఆహా ఓటిటి వచ్చాక వెబ్ సిరీస్ లు రూపొందించడం బాగానే వేగం పుంజుకుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నేతృత్వంలో దిల్ రాజు తదితరుల భాగస్వామ్యంతో ఆహా ఓటిటి ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో చెప్పక్కర్లేదు. అక్కినేని కోడలు సమంత చేస్తున్న ఓటిటి ప్రోగ్రామ్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఇక వెబ్ సిరీస్ లతో కొత్తవాళ్లకు కూడా ఛాన్స్ రావడంతో మెగాడాటర్ నిహారిక యాంకర్ అనసూయతో కలిసి ఓ వెబ్ సిరీస్ లో చేస్తోంది. రాయుడు చిత్రాలు బ్యానర్ పై భాను రాయుడు ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాడు.

ఇటీవలే పూజా కార్యక్రమంతో లాంచనంగా ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ లో యూట్యూబర్ నిఖిల్ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ నిర్మాణంలో నిహారిక భర్త చైతన్య కూడా భాగమేనట. అందుకే అతను దాదాపు 3కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు టాక్. ఇలా బడ్జెట్ పెడుతున్న విషయంలో కొన్ని వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో వైరాలవుతున్నాయి. దాదాపు ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ 6 కోట్లవరకు అంచనా.