ప్రభాస్ పెళ్లి గోదావరి జిల్లా అమ్మాయితోనా ?వైరల్ అవుతున్న న్యూస్

prabhas marriage :కరోనా లాక్ డౌన్ లో ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచిలర్స్ నిఖిల్, నితిన్, రానా వంటివాళ్ళు పెళ్లిళ్లు చేసుకున్నా, టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి మాత్రం మేరేజ్ కాలేదు. అయితే ఈ పాన్ ఇండియా స్టార్ పెళ్లికి సంబంధించి సోషల్, వెబ్ మీడియాలో ఇప్పటికే ఎన్నో వార్తలు వైరలయ్యాయి. అయితే ప్రభాస్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, గోదావరి జిల్లాలకు చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అది నిజం కాదని తేల్చేసారు. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్ సినిమాలకు డేట్స్ ఇచ్చి, ఆ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని టాక్.

ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ ఏడాది విడుదల వుంటుందని టాక్. నిజానికి బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి అని వార్తలు వచ్చినా ప్రభాస్ పెళ్లి మాత్రం అవ్వలేదు. నిజానికి ప్రభాస్ పెళ్లి కోసం అతడి ఫాన్స్ కూడా అసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్న ప్రభాస్ ఈ ఏడాది వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అందుకే ఎన్ని వార్తలు వస్తున్నా సరే, ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో నిజమంటూలేదు.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగళ్తూరుకి చెందిన వ్యక్తికావడంతో ఆ అమ్మాయిది పశ్చిమ గోదావరి జిల్లా అని ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు భార్య సన్నిహితుల కుటుంబానికి చెందిన గోదావరి జిల్లాకు చెందిన ఒక అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హల్ చల్ చేసింది. 2021 సంవత్సరం చివరలో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని. ప్రభాస్ కు కాబోయే భార్య, కుటుంబ సభ్యులు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారని, అమ్మాయి కుటుంబ సభ్యులకు సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఇతర వ్యాపారాలు ఉన్నట్టు వార్తలొస్తున్న క్లారిటీ మాత్రం రాలేదు