MoviesTollywood news in telugu

గంగవ్వ సొంతింటి కల సాకారం అవుతోందా…సొంత ఖర్చు ఎంత…?

Bigg boss fame gangavva :సొంతింటి కల ఉన్నా అది అందరికీ సాధ్యం కాదు. కానీ ‘మై విలేజ్ షో’ ద్వారా ఫేమస్ అయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన గంగవ్వ సొంతింటి కల సాకారం అవుతోంది. ఇందుకు స్టార్ మా లో ప్రసారమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వేదిక కావడం విశేషం. బిగ్ బాస్ సీజన్ 4 లోకి వచ్చాక తన ఆర్ధిక స్థితి, ఇంటి గురించి గంగవ్వ చెప్పింది. అయితే అనారోగ్య సమస్యల వల్ల ఎలిమినేట్ అయింది. కొత్త ఇల్లు కట్టివ్వాలని కోరడంతో బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే సమాయనికే గంగవ్వ ఇంటి పనులు ప్రారంభం అయ్యాయి.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్స్ గంగవ్వను మెచ్చి, దివి ముక్కుపుడక; మోనాల్ చీర; అఖిల్ చీర గిఫ్ట్ లుగా ఇచ్చారు. ఇక గంగవ్వకు అడపాదడపా సినిమా ఆఫర్లు వస్తున్నా మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ మీదే శ్రద్ధ పెట్టింది. గంగవ్వ ఇంటికోసం మొత్తం ఆరు గదులు, మూడు బాత్ రూమ్ లు కట్టించాలని దాదాపు 20 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే బిగ్ బాస్ నుంచి 18 లక్షలు, సొంత డబ్బు 2 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. బిగ్ బాస్ రెమ్యునరేషన్ గా హోస్ట్ నాగ్ ఇచ్చిన చెక్కులు కూడా అందాయని గంగవ్వ చెప్పింది.

బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులతో గంగవ్వ గతంలో బంగారం కూడా కొన్నట్లు టాక్. బిగ్ బాస్ టీం, నాగార్జున ఇచ్చిన మాట ప్రకారం గంగవ్వ ఇంటి కోసం డబ్బులు ఇవ్వడం సహజంగానే ప్రశంసలు లభిస్తున్నాయి . ఇప్పటికే పిల్లర్స్ నిర్మాణం పూర్తి కాగా గోడల నిర్మాణం వేగంగానే జరుగుతోంది. డీఎంకే కంపెనీ వాళ్లు ఇంటిని బాగా కడుతున్నారని గంగవ్వ చెప్పింది. సగం ఇంటి పనులు పూర్తి కాగా గంగవ్వ హౌస్ ఓపెనింగ్ కు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరినీ పిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.