MoviesTollywood news in telugu

జయప్రద గురించి నమ్మలేని నిజాలు మీకోసమే…అసలు నమ్మలేరు

Telugu Actress Jaya Prada : భూమి కోసం మూవీతో 1976 లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయిన అందాల తార జయప్రద ఇటు తెలుగు, అటు హిందీ భాషల్లో తన సత్తా చాటింది. అలాగే తమిళం, మలయాళం, బెంగాళీ, కన్నడ ఇలా 8 భాషల్లో నటించి, మెప్పించింది. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన జోడీ కట్టిన ఈమె రాజకీయాల్లోనూ బాగా రాణించింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో కూడా నటనకు దూరం కాలేదు. ప్రస్తుతం జయప్రద తెలుగులో రాజేంద్రప్రసాద్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించింది, షాడె గర్ల్స్ హైస్కూల్ , రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో చదివిన ఈమె అసలు పేరు లలితారాణి. బాల్యంలో డాక్టర్ కావాలని అనుకున్న జయప్రదకు సినిమాలంటే మక్కువ కావడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సిరిసిరి మువ్వ మూవీ ఈమెకు మంచి పేరు తెచ్చింది. అంతులేని కథ వంటి చిత్రాల్లో ఈమె నటన అద్భుతం. ఇక సాగరసంగమం సినిమా అయితే చెప్పక్కర్లేదు. అందుకే సాగర సంగమం రీమేక్ చేస్తే నటిస్తానంటూ ఇటీవల ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో అందగాడు అంటే శోభన్ బాబేనని చెప్పిన జయప్రద, సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి చేరి, తెలుగుదేశం తరపున ప్రచారం చేసానని చెప్పింది. పార్టీ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబుకు మద్దతు పలికి తప్పు చేశానని, పైగా చంద్రబాబు తన సేవలను గుర్తించలేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఏపీ ప్రజలకు సేవ చేయాలని ఆశించిన తాను అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లి రామ్ పూర్ నుంచి రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యానని వివరించింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, అప్పట్లో తనను రాజకీయాల్లోకి రావొద్దని సూచించిన కమల్ హాసన్ ఇప్పుడు ఆయనే రాజకీయాల్లోకి వచ్చారని జయప్రద వ్యాఖ్యానించారు.