MoviesTollywood news in telugu

కోట్ల విలువైన బంగ్లాలు వదిలి అద్దె ఇంట్లో స్టార్స్…కారణం ఇదే

Tollywood Stars Staying at Rental Houses :మన స్టార్ హీరోలు, సెలబ్రిటీలతో చాలామంది లంకంత సొంతిల్లు వదిలిపెట్టి సాధారణ జీవనం గడుపుతున్నారు. డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి రాజభవనం లాంటి ఇల్లు ఉంది. అయితే ఈ ఇల్లు వదిలిపెట్టి, ఓ కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లోకి మారాడు. ఎదురింట్లోనే అతడి సోదరి మంజుల కూడా నివాసం ఉంటోంది.

ప్రిన్స్ మహేష్ బాబుకి గల ఆస్తి ముందు ఈ ఫ్లాట్ ఏమాత్రం సరిపోదని ఈజీగా చెప్పొచ్చు. 10వేల కోట్ల ఆస్తులున్న మహేష్ సాదా సీదా జీవనం సాగిస్తున్నాడు. ఇటు అక్కినేని, అటు దగ్గుబాటి ఫ్యామిలీస్ కి దగ్గరైన నాగచైతన్య కావాలనుకుంటే రాజభవనం లాంటి ఇంటిని నిర్మించి ఇస్తారు. అయితే అబిడ్స్ లోని సాదాసీదా ప్లాట్ లో ఉంటున్నాడు. పెళ్లయ్యాక కూడా భార్య సమంతతో కల్సి అదే ఇంట్లో ఉంటున్నాడు. తన తల్లి డిజైన్ చేయడం వలన అక్కడే ఉంటున్నాడు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రిబుల్ బెడ్ రూమ్ లో ఉండేవాడు. అయితే తర్వాత ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అయ్యాడు. మొక్కలు పెంచడం, వ్యవసాయం చేయడం వంటివి పవన్ కి ఎంతో ఇష్టం. జగపతిబాబుకి అపోలో దగ్గరలో వెయ్యి గజాల్లో భారీ బంగ్లా ఉంది. ఇది కాదని రోటా టవర్స్ లోని ఓ ప్లాట్ లో ఉంటున్నాడు. శ్రీనగర్ కాలనీలో పెద్ద బంగ్లా గల అలీ మణికొండలో త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నాడు. మొదట్లో ఓ విల్లాలో ఉన్న రాజమౌళి తర్వాత త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో ఉంటున్నాడు. మణికొండలో మంచి ఇల్లు ఉన్నప్పటికీ జనం తాకిడికి తట్టుకోలేక గచ్చిబౌలిలో ఓ ప్లాట్ కి సుకుమార్ షిఫ్ట్ అయ్యాడు