MoviesTollywood news in telugu

రావు రమేష్ జీవితంలో ఈ నమ్మలేని నిజాలు మీకు తెలుసా? అసలు నమ్మలేరు

Telugu Actor Rao Ramesh :విలక్షణ నటుడు, దర్శకుడు అయిన రావు రమేశ్ తెలుగు ఇండస్ట్రీకి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి మంచి గుర్తింపు కొట్టేసాడు. 200పైగా సినిమాల్లో చేసిన ఈయన సీమ సింహం మూవీతో తెలుగు వెండితెరపై కనిపించి, మళ్ళీ ఐదేళ్లు వెయిట్ చేసారు. సీరియల్స్ లో నటిస్తూ ఒక్కడున్నాడు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి తన హవా కొనసాగిస్తున్నారు. 1968 ఏప్రియల్ 28న రావు కమలకుమారి, రావు గోపాలరావు దంపతులకు చెన్నైలో జన్మించి అక్కడే పెరిగాడు. ఈయనకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. అలాగే భార్య,ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. చెన్నైలో కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు. తన +2 లో పాఠశాల వదిలి బయటకు రావాలని కోరుకున్న సమయంలో ఫోటోగ్రఫీ ఆసక్తి కలిగి బ్రిటిష్ లైబ్రరీ & అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి ఫోటోగ్రఫీ పుస్తకాలను అధ్యయనం చేసేవాడు.

పుస్తక పఠనం మీద ఆసక్తితో తాను చదివే పనిలో సాధారణంగా తన గడ్డం గీసుకోవడం కూడా మరచిపోయేవాడు.తండ్రి నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వెళ్లి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన సత్తా చాటారు. లెజెండరీ యాక్టర్ అయ్యారు. ఇక తల్లి రావు కమలకుమారి ప్రముఖ హరికథ విద్వాంసురాలు. అతను ఒక నటుడు కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను ప్రసిద్ధ స్టిల్ ఫోటోగ్రాఫర్ కావాలని ఆశించాడు. కానీ విధి అతనిని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది.

గమ్యం చిత్రంలో తాను నటించిన నక్సలైట్ పాత్ర తన భవిష్యత్తును మార్చింది. కె.ఎస్.ప్రకాశ రావువద్ద రమేష్ సహాయకుడిగా చేరి దాదాపు పదేళ్లు పనిచేసారు. ఆతర్వాత అమెరికన్ యూనివర్సిటీకి దరకాస్తు చేసుకున్నారు. అయితే సీటు రాలేదు. 1994లో ఇక రావు గోపాలరావు కన్ను మూశారు. తరువాత అతను ఒక జంట కథలు వ్రాసి సినిమాలకు దర్శకత్వం చేయాలని కోరుకున్నాడు. కానీ అతని తల్లి అతనిని తండ్రిలా నటనను వృత్తిగా ఎన్నుకోమని ప్రోత్సహించింది. ప్రారంభంలో అతన నటన గురించి అయిష్టంగా ఉన్నా అంగీకరించాడు.

ఘంటశాల రత్నకుమార్ టి.వి.సీరియల్ లో ఛాన్స్ వచ్చింది. ఆ సీరియల్ మధ్యలో నిలిచిపోయింది. అప్పుడు రమేశ్ కి నందమూరి బాలకృష్ణ సినిమా సీమ సింహంలో సిమ్రాన్ సోదరుడుగా ఓ చిన్న పాత్రలో నటించాడు. అయితే ఆ తర్వాత అతనికి ఆఫర్లు రాలేదు.అప్పుడు అతడు తిరిగి చెన్నైలో టి.వి ధారావాహికలు “పవిత్ర బంధం” “కలవారి కోడలు” లలో నటించాడు. 2007లో రీ ఎంట్రీ ఇస్తూ, ఒకడున్నాడు సినిమాలో చిన్నపాత్రలో కనిపించి, ఆతర్వాత క్రిష్ డైరెక్ట్ చేసిన గమ్యం మూవీలో నక్సల్ పాత్రలో చేసి తననటనకు ప్రశంసలు అందుకున్నాడు.

కొత్త బంగారులోకం,ఆవకాయ్ బిర్యాని,మగధీర మూవీస్ లో మంచి పేరుతెచ్చుకున్నాడు. లీడర్, ఖలేజా,మిరపకాయ్,బద్రీనాధ్,పిల్ల జమిందార్, గబ్బర్ సింగ్ ,జులాయి,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,షాడో,ఇద్దరమ్మాయిలతో, బలుపు లాంటి మూవీస్ లో చేసి రావు రమేష్ లాంటి నటుడుటాలీవుడ్ లో ఉన్నాడని చాటిచెప్పాడు. 2015లో ముకుంద మూవీలో నటించి పేరు తెచ్చుకున్నాడు.

సినిమా చూపిస్తా మామా, సన్నాఫ్ సత్యమూర్తి,దోచేయ్,బెంగాల్ టైగర్,బ్రూస్ లీ,త్రిపుర,స్పీడున్నోడు,సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం,శ్రీరస్తు శుభమస్తు,వంటి సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి అందరిని మెప్పించాడు. కాటంరాయుడు,హైపర్,అ ఆ , నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ ,అరవింద సమేత,ఆర్ ఎక్స్ 100,భరత్ అను నేను,24కిస్సెస్ ,యాత్ర,సినిమాలతో తారాస్థాయికి చేరిన రావు రమేష్ మజిలీ సినిమాతో తన నటనను మరోసారి ఆకట్టుకున్నాడు.