MoviesTollywood news in telugu

భయపడుతున్న ప్రభాస్ అభిమానులు…కారణం ఇదేనట

Prabhas new Movie :తమ అభిమాన హీరో సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని రికార్డులు కొల్ల గొట్టాలని ప్రతి హీరో అభిమాని కోరుకుంటాడు. ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాన్స్ అయితే చెప్పక్కర్లేదు. బాహుబలి రెండు పార్టులతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే దాని తర్వాత వచ్చిన పాన్ ఇండియా మూవీ సాహో అనుకున్న విజయం సాధించలేదు. దాంతో ప్రభాస్ సినిమా కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఈలోగా కరోనా, లాక్ డౌన్ పరిస్థితులు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న రాధేశ్యామ్ కోసం ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జులై 30న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. డార్లింగ్ తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ మూవీ టీజర్ చూస్తే, ప్రభాస్ ఇటాలియన్ భాష మాట్లాడుతూ కనిపిస్తోంది.

టీజర్ లో ఇలా చూసాక ఈ సినిమాలో ఇలాంటి డైలాగులు ఇంకా ఎన్ని ఉన్నాయో అని ఫాన్స్ డైలమాలో పడ్డారు. ఎందుకంటే, గతంలో టాలీవుడ్‌లో ఇటలీ, స్పెయిన్ భాషలకు సంబంధించి డైలాగులు, పాటలు తెలుగు ప్రేక్షకులను మెప్పించలేదు. పైగా ఈ టీజర్‌లో ప్రభాస్ లుక్ కూడా అంతగా బాగోలేదని ఫాన్స్ కలవర పడుతున్నారు. పైగా ఇన్నాళ్లూ యాక్షన్‌ సినిమాలు చేసిన ప్రభాస్ ఇలా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రావడం సహజంగానే ఫాన్స్ ని భయపెడుతోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."