MoviesTollywood news in telugu

గృహలక్ష్మి సీరియల్ రోహిత్ రియల్ లైఫ్…నమ్మలేని ఎన్ని నిజాలో…?

Intinti Gruhalakshmi Serial Rohit :స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతూ విశేష ఆడియన్స్ ఆదరణ పొందుతున్న గృహలక్ష్మి సీరియల్ కి మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న రోహిత్ పాత్రధారి ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న నటుడే. అసలు పేరు పృథ్విరాజ్.

1965నవంబర్ 29న బెంగళూరులో పృథ్విరాజ్ జన్మించారు. పలు సినిమాల్లో చేసి , టివి రంగంలో అడుగుపెట్టి ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ఆడియన్స్ ని మెప్పిస్తున్న పృథ్విరాజ్ నిజానికి చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. 1971లో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టిన పృథ్వి1974లో అమ్మ మనసు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి, ఆతర్వాత తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు.

ఇక 1997లో పెళ్లి అనే తెలుగు సినిమాలో విలన్ రోల్ వేసి , బాగా పాపులర్ అయిన పృథ్వి తొలిసినిమాతోనే బెస్ట్ విలన్ గా నంది అవార్డు అందుకున్నాడు. పెళ్లిపందిరి, దీర్ఘ సుమంగళీభవ, సమరసింహారెడ్డి, ప్రేయసి రావే, సమ్మక్క సారక్క, దేవుళ్ళు, నువ్వు నాకు నచ్చావ్, సంతోషం, చెన్నకేశవరెడ్డి, వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బుల్లితెరమీద కూడా వాణి రాణి, రహస్యం వంటి ఎన్నో సీరియల్స్ లో చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో రోహిత్ గా నటించి మెప్పిస్తున్నాడు.