MoviesTollywood news in telugu

నితిన్ కి ఎన్ని కోట్ల అస్థి ఉంది….కొన్ని నమ్మలేని నిజాలు

Telugu Actor Nithin :లాక్ డౌన్ పిరియడ్ లోనే పెళ్లిచేసుకున్న యంగ్ హీరో నితిన్ 2002లో తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, తొలిసినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 38ఏళ్ళు పూర్తిచేసుకుంటున్నాడు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సుధాకర రెడ్డి, విద్యారెడ్డి దంపతులకు1983లో మార్చి 30 న నిజమాబాద్ లో జన్మించిన నితిన్ అసలు పేరు నితిన్ కుమార్ రెడ్డి. నిక్ నేమ్ గా నితిన్ అండ్ చింటూ అని పిలుస్తారు. 5అడుగుల 9అంగుళాలు ఉంటాడు. 72కిలోల బరువు ఉంటాడు.

నితిన్ సిస్టర్ నిఖితా రెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సెయింట్ ఆంటోని హైస్కూల్ లో చదివిన నితిన్ లింగంపల్లిలో రత్న జూనియర్ కాలేజీలో చదివాడు. 2020 ఏప్రియల్ 15న తాజ్ ఫలక్ నామ ప్యాలస్ లో షాలిని కందుకూరి అనే అమ్మాయితో పెళ్లయింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే జయం మూవీలో నటించాడు. మెగాస్టార్ చిరంజీవి,పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి చాలా ఇష్టం. నదియా, సౌందర్య ఇష్టమైన హీరోయిన్స్ . బంగాళా దుంప కర్రీ, చపాతీ అంటే ఇష్టం. ఆస్ట్రేలియా ఇష్టమైన ప్రదేశం. టివి చూడ్డం, పాటలు, డాన్స్ హాబీలు.

ఇష్క్ , గుండెజారి గల్లంతయింది వంటి హిట్స్ అందుకున్న నితిన్, కొన్ని ప్లాప్ లు ఎదుర్కొన్నా, భీష్మ మూవీతో ట్రేండింగ్ లోకి వచ్చాడు. ఈ సినిమా హిట్ తో డైరెక్టర్ వెంకీ కొడుముల కు 59లక్షల 40వేల విలువైన రేంజ్ రావల్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఒక్కో సినిమాకు 6నుంచి 7కోట్లు అందుకుంటాడట. 2017లో 55లక్షల 60వేల విలువైన జంగవర్ ఎక్స్ ఎఫ్ అనే కారు కొన్నాడు. బిఎం డబ్ల్యు ఎక్స్ 5కారుని 75లక్షల 30వేలతో కారు కూడా కొన్నాడు. అలాగే కోటి 20లక్షల పార్చే ఖయానీ కారు కొన్నాడు. 16లక్షల 90వేల విలువైన బైక్ ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఏడెనిమిది కోట్ల విలువైన హౌస్ ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."