MoviesTollywood news in telugu

అవే కళ్ళు సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Ave Kallu Full Movie :జేమ్స్ బ్యాండ్, గూఢచారి మూవీస్ కి పెట్టింది పేరైన సూపర్ స్టార్ కృష్ణ క్రైమ్ సినిమాల్లో నటించారు. కానీ క్రైమ్ కి సంబంధించి తొలి తెలుగు కలర్ మూవీగా అవేకళ్ళు సినిమా నిలుస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ, కాంచన నటించిన ఈ సినిమాను తెలుగు,తమిళ భాషల్లో నిర్మించింది. తమిళంలో రవిచంద్రన్ నటించారు. హీరో కృష్ణ కు కలర్ లో ఇది రెండో చిత్రం కాగా, కెరీర్ లో 10వ సినిమా. ఏవిఎం లో మాత్రం తొలిసినిమా. ఆరోజుల్లో ప్రతిరోజూ రిహార్సల్స్ కి వెళ్లాల్సిందే. కృష్ణ ప్రతిరోజూ రిహార్సల్స్ కి వెళ్లేవారు.

ఇక మొదటి సినిమా తేనెమనసులు సమయంలో షూటింగ్ స్పాట్ లో డాన్స్, స్కూటర్ డ్రైవింగ్ లో దెబ్బలు తగిలిన కృష్ణ కొంత ఇబ్బంది పడ్డారు. అలాగే కన్నె మనసులు షూటింగ్ లో కూడా గుర్రం మీది నుంచి కిందపడి దెబ్బలు తిన్నారు. అయితే పెద్ద ప్రమాదమే తప్పింది. ఇద్దరు మొనగాళ్లు షూటింగ్ లో ఫైట్స్ లో ఒళ్ళంతా గీసుకుని రక్తం వచ్చేది. గూఢచారి 116లో కూడా నెల్లూరు కాంతారావు ని పైకి ఎత్తాల్సిన సమయంలో ఎడమ మోకాలు పట్టేసింది. దాని ప్రభావం చాలా కాలం ఉంది. ఇలా ప్రతి సినిమాకు దెబ్బలు తగిలేవి.

ఇక అవేకళ్ళు సినిమా సమయంలో క్లబ్ డాన్సర్ పాత్ర పోషించిన కృష్ణకు ఫైట్ సీన్ లో ముక్కుమీద దెబ్బ తగిలి రక్తం బాగా కారింది. కలర్ ఫిలిం కొరత ఎక్కువ కావడంతో ఫారెన్ కరెన్సీ సంపాదించి నిర్మాత కలర్ ఫిలిం కొనేవారట. ఈ సినిమా ప్రింట్లు ఈస్టమన్ కలర్ లో ఎక్స్ పోజ్ చేసి, పింట్స్ మాత్రం ఆర్ ఓ కలర్ లో తీశారు. ఎందుకంటే సినిమా దెబ్బతిన్నా, నష్టం పెద్దగా ఉండదని నమ్మకం. ఈ మూవీలో గుమ్మడి, రాజనాల, పద్మనాభం, నాగభూషణం తదితరులు నటించారు. 1967 డిసెంబర్ 14న రిలీజైన ఈ మూవీ సెకండాఫ్ లో సస్పెన్స్ తో సాగుతుంది. అయితే ఫస్ట్ రన్ లో ఎవెరెజ్ గా ఆడిన ఈ మూవీ తర్వాత రన్స్ లో బాగా ఆడింది.