వెంకటేష్ కూతురు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా ?
venkatesh daughter aashritha :టాలీవుడ్ హీరో వెంకటేష్ గురించి మనకు అందరికీ తెలిసిందే అయితే వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడడు అలాగే బయట కూడా పెద్దగా కనపడరు. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితకి పెళ్లి అయిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత కు హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక రెడ్డి తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆమె భర్తతో విదేశాలలో ఉంది.
ఆశ్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆశ్రిత సోషల్ మీడియాలో ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో.ప్రొఫెషనల్ బేకర్ లా అకౌంట్ ను మెయింటెన్ చేస్తుంది.ఈ అకౌంట్ ద్వారా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.
ఓ నెటిజన్ తనను మీది లవ్ మ్యారేజా అని ప్రశ్నించగా దానికి కాదని చెప్పుతు తను , తన భర్త ఒకే స్కూల్లో చదువుకున్నామని, చాలా కాలం నుంచి తమకు పరిచయం ఉందని చెప్పింది.