MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ సంపాదన,లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక లుక్ వేయండి

Allu Arjun Movies :అల్లు వారి అబ్బాయిగా గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. చెన్నైలో అల్లు అరవింద్, నిర్మల దంపతులకు 1983ఏప్రియల్ 8న జన్మించిన అల్లు అర్జున్ కి ప్రస్తుతం 38ఏళ్ళు పూర్తయింది. 5అడుగుల 8అంగుళాలు ఎత్తు ఉంటాడు. అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ అనే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. శిరీష్ హీరోగా ఉన్నాడు. అయితే వెంకటేష్ గీతా ఆర్ట్స్, పబ్ , కంపెనీలు చూస్తుంటాడు. తమిళనాడులో సెయింట్ మేరీస్ స్కూల్లో చదివిన బన్నీ, హైదరాబాద్ మాగుంట సుబ్బరామిరెడ్డి కాలేజీలో చదివాడు. బిబిఎ పూర్తిచేసాడు.

బన్నీ, స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ని కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2011 మార్చి 6న స్నేహారెడ్డితో హైదరాబాద్ లో ఘనంగా పెళ్లి అయింది. వీరికి 2014 ఎప్రియాల్ 3న హైదరాబాద్ లో అల్లు అయాన్ పుట్టాడు. 2016నవంబర్ 21న అల్లు అర్హ పుట్టింది. 1985లో మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత మూవీలో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసాడు. 1986లో కమల్ హాసన్ నటించిన స్వాతిముత్యం మూవీలో కూడా నటించాడు. 2001లో మెగాస్టార్ డాడీ సినిమాలో డాన్స్ మీద మక్కువతో నటించే ఛాన్స్ బన్నీకి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి అంటే బన్నీకి ఇష్టమైన హీరో. రాణీముఖర్జీ ఇష్టమైన హీరోయిన్. పారిస్ అంటే చాలా ఇష్టం. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ తో , బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ దూసుకెళ్తున్నాడు. సుకుమార్ మూవీ పుష్పతో కొత్త లుక్స్ తో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం 70కిలోల బరువున్నాడు. 50లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకూ ఖరీదు గల 8కార్లు న్నాయి. 2019లో కార్వాన్ కొని, స్పెషల్ డిజైన్ చేయడంతో 7న్నర కోట్లు ఖర్చ యింది. ఫిలిం నగర్ లో ఉన్న ఇంటి ఖరీదు 10నుంచి 15కోట్లు ఉంటుంది. 2011లో కోకాపేట లో స్టూడియో కూడా లాంచ్ చేసాడు.