హీరోయిన్ రాశి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?
Telugu actress Raasi : రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా మారి మంచి సినిమాలు చేసింది ఆ తర్వాత బరువు బాగా పెరగడంతో హీరోయిన్ పాత్రకు దూరమైంది నిజం సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ వేసింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుంది. ఒక పాప పుట్టటంతో ఆమెను చూసుకోవటంతో ఇప్పటివరకు సమయాన్ని గడిపేసింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేదు దాంతో బుల్లితెరలో సీరియల్ ద్వారా అభిమానులకు దగ్గర కాబోతోంది.
స్టార్ మా లో కొత్తగా రాబోతున్న జానకి కలగనలేదు అనే సీరియల్ లో హీరో కి తల్లి క్యారెక్టర్ లో చేస్తుంది.అమ్మ కేరెక్టర్ లో రాశి కాస్త మాస్ గానే కనబడుతుంది. కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకునే తల్లి కేరెక్టర్ లో రాశి ఈ జానకి కలగనలేదు అనే సీరియల్ లో కనిపించబోతుంది. త్వరలోనే స్టార్ మా లో ఈ సీరియల్ మొదలుకాబోతుంది.