MoviesTollywood news in telugu

ఓటిటి వలన దృశ్యం సీక్వెల్ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?

Drishyam 2 Full Movie :తెలుగులో ఆ మధ్య వచ్చిన దృశ్యం మూవీ బిగ్గెస్ట్ హిట్ అయింది. వెంకటేష్, మీనా నటించిన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. అయితే ఇది మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ హీరోగా జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం మూవీకి రీమేక్ గా వచ్చింది. మలయాళంలో సూపర్‌ హిట్‌ అవ్వడంతో తెలుగులో, ఆతర్వాత హిందీలో ఇంకా తమిళంలో కూడా రీమేక్‌ చేసి, హిట్ అందుకున్నారు. తాజాగా దృశ్యం మూవీకి సీక్వెల్ దృశ్యం 2‌ రూపొందింది.

నిజానికి గత ఏడాది మొదట్లోనే సినిమా పునః ప్రారంభించారు. సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన వెంటనే విడుదల చేయాలనుకున్నారు. కరోనా అందరినీ దెబ్బతీసినట్టే సినిమా వాళ్లకు కష్టాలు తెచ్చింది. దృశ్యం 2కి కూడా జాప్యం ఏర్పడింది. థియేట ర్లలో విడుదల చేసి ఉంటే, బాగుండేది. కానీ నిర్మాతల ఆర్థిక సమస్యల కారణంగా అమెజాన్‌ ప్రైమ్‌ కు దాదాపుగా 30 కోట్లకు అమ్మేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యి ఉంటే మరోలా ఉండేలా పరిస్థితి ఉండేదన్న మాట ఇండస్ట్రీలోనే వినిపించడం విశేషం.

ఎందుకంటే, ఈ సినిమాకు సూపర్‌ హిట్‌ టాక్‌ రావడం వలన ఈజీగా 30 కోట్లకు పైగా రాబట్టేదని, ఇక ఓటీటీ లో సినిమా విడుదల చేస్తే, మరో పది కోట్ల దాకా వచ్చేదని అంచనా. నిర్మాతలు కాస్త ఓపిక పడితే, ఖచ్చితంగా మంచి వసూళ్లు వచ్చేవని అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. పైగా ఓటీటీ లో విడుదలవ్వడం వల్ల రీమేక్ రైట్స్ కు కూడా తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి సూపర్‌ హిట్‌ సినిమా సీక్వెల్‌ ను ఓటీటీ లో విడుదల చేయడం తప్పేనని, దీనివలన 15 నుండి 20 కోట్ల వరకు నష్టం వచ్చిందని టాక్ బలంగా వినిపిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."