MoviesTollywood news in telugu

చిరుత సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…!?

Chirutha Telugu Full Movie :మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమా ఎంట్రీ గురించి 2005లో వార్త వచ్చింది. అపరిచితుడు మూవీ తర్వాత డైరెక్టర్ శంకర్ ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే ఎన్ని గాసిప్స్ వచ్చినా చిరు మాత్రం తనదైన శైలిలో ప్రయత్నం చేశారు. వివి వినాయక్, శ్రీను వైట్ల, జయంత్, వి .ఎన్. ఆదిత్య, విజయ భాస్కర్, ఇలా చాలామంది కథలు విన్పించారు. ఫాన్స్ లో కూడా చాలా అంచనాలు పెరిగిపోతూ వచ్చాయి.

అయితే చిరు దృష్టిలో రాజమౌళి ఉన్నారు. ఆయన్ని పిలిపించి మాట్లాడారు. అయితే మొదట్లో ఇంటరెస్ట్ చూపిన జక్కన్న తర్వాత ఆలోచనలో పడ్డాడు. రామ్ చరణ్ యాక్టింగ్ స్టైల్ చూసాక రెండో సినిమా తానే చేస్తానని చెప్పేసాడు. చిరు కూడా ఒకే అయ్యాడు. దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చెర్రీతో జక్కన్న మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా అయింది.

ఇక తొలిసినిమా ఎవరితో చేయించాలా అని ఆలోచిస్తుంటే, పోకిరి బ్లాక్ బస్టర్ కావడంతో ఆ మూవీ చూసిన చిరు, వెంటనే పూరి జగన్నాధ్ తో లాంచ్ చేయించాలని ఫిక్స్ అయ్యాడు. స్టాలిన్ వేడుకలో చెర్రీ ఎంట్రీ గురించి చిరు డైరెక్ట్ గా ప్రకటన చేయడం విశేషం. స్టోరీ లైన్ చెప్పి, బ్యాంకాక్ వెళ్ళిపోయిన పూరికి ఈ సినిమాలో హరీష్ శంకర్ బాగా సహకరించాడు.

ఈలోగా ఫైట్స్, డాన్స్ లో చెర్రీ కూడా ఆరితేరాడు. రాజస్థాన్ లో హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. 2006డిసెంబర్ లో పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. కంగనా రౌనత్ ని అడిగితె డేట్స్ కుదరక నేహా శర్మ సెలెక్ట్ చేసారు. ఆమెకు అదే తొలిమూవీ. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ప్రకాష్ రాజ్ తదితరులతో తారాగణం కూడా సెలెక్ట్. 2007ఫిబ్రవరిలో బ్యాంకాక్ లో తొలిషెడ్యూల్ స్టార్ట్.

ఎక్కువ భాగం బ్యాంకాక్ లో తీసి, హైదరాబాద్ అన్నపూర్ణ, పద్మాలయ, రామానా యుడు స్టూడియోస్ లో మిగిలిన భాగం పూర్తి. ఆగస్టు 22న ఆడియో రిలీజ్. కోటి రూపాయలకు ఆడియో హక్కులు విక్రయించి అప్పట్లో సెన్షేషన్ అయింది. చిరుత టైటిల్. భారీ అంచనాల నడుమ, ఫాన్స్ రచ్చ రచ్చ నడుమ 2007సెప్టెంబర్ 8న సినిమా 720 సెంటర్స్ లో రిలీజయింది. ఫైట్స్ అదరగొట్టేసాడని, డాన్స్ లో తండ్రికి తగ్గ తనయుడని తొలిసినిమా తోనే పేరొచ్చేసింది.

పూరి పవర్ ఫుల్ స్క్రీన్ ప్లే, మణిశర్మ సంగీతం అన్నీ వెరసి చిరుత సూపర్ హిట్ అయింది. తమ సరైన వారసుడు దొరికాడని చిరు ఫాన్స్ చెలరేగిపోయారు. బెంగాల్ డబ్బింగ్ అయింది. స్పెషల్ జ్యురి నంది అవార్డు చెర్రీకి వచ్చింది. తొలిరోజు నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసి, మొదటి వారం 12కోట్లు కలెక్ట్ చేసి, ఆల్ టైం ఫోర్ గా నిలిచింది. 38సెంటర్స్ లో 100డేస్ ఆడింది. 25కోట్ల షేర్ తో ఉప్పెన వరకూ ఇదే హయ్యెస్ట్ షేర్ కావడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."