MoviesTollywood news in telugu

నాగబాబు కొత్త గెటప్…దేని కోసమో తెలుసా?

Nagababu latest photos :ఒకప్పుడు హీరో వేషాలు వేస్తేనే గుర్తింపు వచ్చేది. కానీ ట్రెండ్ మారింది. విలన్ గా కూడా వేసి మెప్పిస్తూ రెమ్యునరేషన్ కి కొదవలేకుండా , ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఇబ్బంది లేకుండా కొందరు స్టార్ లు తమ పంధా మార్చుకుంటున్నారు. పైగా ప్రస్తుత పోటీలో ట్రెండుకి తగ్గట్టు వెళ్తేనే ఛాన్స్ లు దండిగా వస్తాయి. అందరూ వెంటపడతారు. ఇప్పటికే జగపతిబాబు హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా మారిపోయి, సక్సెసయ్యారు. నటసింహా నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు టాప్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు.

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనిజం పండించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అయినా సరే, ఓ మెట్టు దిగి విలన్ గా అవతారం ఎత్తి తన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. ఇప్పుడు అదే బాటలో మెగాబ్రదర్ నాగబాబు విలన్ అవుతారా? అంటూ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. నిజానికి చిరంజీవి సినిమాల్లో కీలక పాత్రలు వేయడమే కాకుండా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో మెప్పించి, మరోవైపు బుల్లితెరమీద కూడా సత్తా చాటిన నాగబాబు నిర్మాతగా కొన్ని ఇబ్బందులు మాత్రం పడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో మెగాబ్రదర్ యాక్టివ్ గా ఉండడమే కాదు, యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా ఇన్ స్టా గ్రామ్ లో మారిన గెటప్ ఫోటోలు చూసేవారికి విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. బాగా గుబురుగడ్డం పెంచి, కోరమీసాన్ని మెలి తిప్పి.. హ్యాండ్ బైసెప్ పై టాట్టూతో , స్లిమ్ గా ట్రిమ్ గా స్టైలిష్ హెయిర్ స్టైల్ తో మెప్పిస్తూ, మీసం మెలేస్తూ దేనికైనా రెడీ అన్నట్లు ఉంది. పైగా తాజా ఫోటోతో “నీళ్లు లేని ఎడారిలో దాహం అంటూ వెతకడం ఎలానో.. ఎఫర్ట్ పెట్టకుండా దేవుడు ఏదో చేసేస్తాడనుకోవడం పొరపాటు అవుతుంది. గాల్లో దీపం ఉంచి దేవుడా నువ్వే చూడు అనడం లాంటిదే!“ అంటూ నాగబాబు థీమ్ లైన్ తో క్యాప్షన్ కూడా ఇవ్వడం కూడా విలన్ గా రాబోతున్నాడా అనే సంకేతాలు ఇచ్చినట్లుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."