MoviesTollywood news in telugu

బాలకృష్ణకు నో చెప్పిన టాప్ హీరోయిన్…ఎవరో…?

Bala krishna New movie :సినిమా అన్నాక హీరో ఎంతముఖ్యమో, హీరోయిన్ కూడా అంతేముఖ్యం. అలాగే విలన్ కూడా బలంగానే ఉండాలి. అన్నీ కుదిరితేనే సినిమా పండుతుంది. కాగా నందమూరి నటసింహం బాలయ్య – డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ సినిమాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన వెలువడింది. ఇక బాలయ్య సరసన హీరోయిన్ కోసం గోపీచంద్ వేట సాగిస్తున్న క్రమంలో ఫిలిం సర్కిల్స్ లో తాజాగా ఓ వార్త జోరుగానే విన్పిస్తోంది.

అదేంటంటే కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేయాలని చూశారట. తాజాగా రవితేజా నటించిన ‘క్రాక్’ మూవీలో మెప్పించిన శ్రుతిహాసన్ ను బాలయ్య సినిమాలో హీరోయిన్ అయితే బాగుంటుందని సంప్రదించారట. పైగా ‘క్రాక్’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కావడంతో ఇప్పుడు బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసాడు. ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు లీడ్ యాక్టర్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు.

అయితే హీరోయిన్ విషయంలో గోపీచంద్ కి ఇబ్బందులు తప్పడం లేదని టాక్ బయటకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’ పాన్ ఇండియా సినిమాలో శృతి హాసన్ చేస్తున్న కారణంగా బాలయ్య సినిమా ఆఫర్ ని సున్నితంగా కాదని చెప్పేసిందట. ‘బీబీ3’ సినిమాకు కూడా చాలా రోజులు హీరోయిన్ సమస్య రావడంతో . ‘అఖిల్’ ఫేమ్ సహేషా సైగల్ – ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ లను సెలెక్ట్ చేశారట. మరి బాలయ్య – గోపీచంద్ మలినేని కాంబోలో రాబోయే సినిమాకి కూడా హీరోయిన్ గా ఎవరిని తెస్తారో చూడాలి. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ కంప్లీట్ చేసిన వెంటనే బాలయ్య గోపీచంద మలినేనితో మూవీ స్టార్ట్ చేస్తాడని టాక్.