MoviesTollywood news in telugu

చిరంజీవి ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడో తెలిస్తే అమ్మో అంటారు

chiranjeevi remake movies list :అందరి హీరోల లెక్క వేరు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లెక్క వేరు. స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రాజకీయాల్లో చేరి, కేంద్రమంత్రి గా కూడా పనిచేసి, కళామతల్లి సేవలో తరించాలని సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.వస్తూ వస్తూనే తమిళంలో హిట్టైన కత్తి రీమేక్ గా ‘ ఖైదీ నంబర్ 150’ నటించి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. అయితే నేరుగా తెలుగు సినిమాల కంటే రీమేక్ సినిమాల్లో ఎక్కువగా మెగాస్టార్ నటిస్తున్నారు. నిజానికి ఇదేమీ కొత్తకాదు. గతంలో కూడా చాలా రీమేక్ మూవీస్ లో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

నిజానికి 1981లో తమిళంలో హిట్టైన సట్టం ఓరు ఇరుత్తరయ్ రీమేక్ ‘చట్టానికి కళ్లు లేవు’ సినిమాలో నటించి విజయం సొంతం చేసుకున్న చిరంజీవి, ఆతర్వాత కన్నడ రీమేక్ లో నటించాడు. కన్నడంలో హిట్టైన పట్టనెక్క బంద పత్నియరు సినిమా రీమేక్ గా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మూవీలో మోహన్ బాబుతో కలిసి చిరంజీవి నటించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక చిరు కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ రీమేక్ కానప్పటికీ ఫస్ట్ బ్లడ్ అనే ఆంగ్ల మూవీ ఆధారంగా తెరకెక్కింది. హిందీలో హిట్టైన సాహెబ్ సినిమాకు రీమేక్ గా ‘విజేత’ హిట్ అయింది.

అలాగే మలయాళంలో హిట్టైన పూనివా పుతికా సినిమాకు రీమేక్ గా ‘పసివాడి ప్రాణం’ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. తమిళంలో హిట్టైన అమ్మన్ కొవిల్ కిజకాలె సినిమా రీమేక్ గా చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 786 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో హిట్లైన ఘరానా మొగుడు, హిట్లర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీస్ కూడా రీమెక్ గా వచ్చినవే. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్ కు మోహన రాజా దర్శకత్వం వహిస్తుండగా వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."