MoviesTollywood news in telugu

వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Telugu actress Varalaxmi Sarathkumar :హీరో రోల్స్ కన్నా నెగెటివ్ రోల్స్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే కొత్త కొత్త విలనిజం పండించే వాళ్ళకోసం వేట సాగుతోంది. హీరోల్లోనే కాదు, హీరోయిన్స్ లో కూడా విలనిజం పండించేవాళ్ళు వచ్చేస్తున్నారు. తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికీ నెగెటివ్ రోల్స్ తో అదరగొట్టేస్తోంది. శింబు హీరోగా నటించిన పోడా పోడీ సినిమాతో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే సందీప్ కిషన్ హీరోగా టాలీవుడ్ లో’తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బీ’మూవీలో విలనిజం పండించిన వరలక్ష్మికి అనుకున్న స్థాయిలో సక్సెస్ దక్కలేదు.

నిజానికి స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘బాయ్స్’ మూవీలో ఒక పాత్రలో నటించే ఛాన్స్ వరలక్ష్మికి వచ్చింది. అడిషన్ లో ఎంపికైనా సరే, తండ్రి గ్రీన్ సిగ్నల్ పడకపోవడంతో అందులో ఆమె నటించలేకపోయింది. ‘ప్రేమిస్తే’ సినిమాలో కూడా వరలక్ష్మికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా సరే, కొన్ని కారణాల వల్ల ఆమె వదిలేసింది. అంతెందుకు, క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఆమె ఎదుర్కొంది.ముఖ్యంగా కోలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

అయితే అందరిలా కాకుండా తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ధైర్యంగా ముందుకు వచ్చి వెల్లడించిన వరలక్ష్మిని పలువురు అప్పట్లోనే అభినందించారు. అన్ని రకాల పాత్రలు చేయాలని సినిమాల్లో మన పని మనం సరిగ్గా చేస్తే మంచి ఫలితం వస్తుందని బలంగా విశ్వసించి, ఆచరణలో నిరూపించుకుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రవితేజ ‘క్రాక్’, అల్లరి నరేష్ ‘నాంది’ సినిమాల్లో విలన్ గా నటించి తన సత్తా చాటింది. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఆమె ఫిదా అవుతూ కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.