MoviesTollywood news in telugu

ప్రస్థానం హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తోందో తెలుసా ?

Telugu actress ruby parihar : సినిమా ఇండస్ట్రీ అందరికీ కల్సి రాదు. కొందరికి రాత్రికి రాత్రే స్టార్ డమ్ వచ్చేస్తే, కొందరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. దాంతో ఇండస్ట్రీకి దూరమై పోతారు. అలా ఇండస్ట్రీకి దూరం జరిగిన వారిలో ముంబై బ్యూటీ రూబీ పరిహార్ ఒకరు. ఈమె ప్రస్తుతం ముంబై లో నివాసముంటోంది. తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవ కట్టా తెరకెక్కించిన ప్రస్థానం మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రూబీ పరిహార్ తెలుగు, కన్నడ, హిందీ, తదితర భాషలలో దాదాపుగా 8కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

ఇందులో ప్రస్థానం, గబ్బర్ ఈస్ బ్యాక్ తదితర చిత్రాలు తప్ప మిగిలిన మూవీస్ అంతంత మాత్రమే. ఇక తెలుగులో హీరోయిన్ గా నటించిన చిత్రాల కథల విషయంలో అవగాహన లేకపోవడం కారణంగానే చాలా మూవీస్ డిజాస్టరయ్యాయి. కొన్ని మూవీస్ అయితే ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియదు. ఇండస్ట్రీలో ఎలాగైనా పాగా వేయాలని కష్టపడినా ఛాన్స్ లు లేక, ముంబైకి చెక్కేసిన ఈమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన “గబ్బర్ ఈస్ బ్యాక్” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.

దురదృష్టం కొద్దీ ఈ చిత్రం కూడా ఈ భామకు కలిసి రాకపోవడంతో ప్రస్తుతం మోడలింగ్ రంగంలో ఉందని టాక్. అయితే ఇటీవలే రూబీ పరిహార్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతు న్నట్లు వార్తలు వచ్చినా కూడా రూబీ పరిహార్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగలేక ఇండస్ట్రీ వదిలేయాల్సి వచ్చింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."