MoviesTollywood news in telugu

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

Telugu actress mumtaz :ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళల్లో కొందరికి మాత్రమే ఛాన్స్ లు వెల్లువెత్తుతాయి. కొందరిని నిరాశ వెంటాడుతుంది. కొందరు వాంప్ పాత్రలకే మరిమితం అయిపోతారు. ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రంలోని హోలీ హొలీ స్పెషల్ సాంగ్ లో నటించి యువ హృదయాలను గెలిచిన నటి ముంతాజ్ ముంబై లో పుట్టి పెరిగింది. ముంతాజ్ సినిమాలపై ఆసక్తి కలగడంతో చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1999లో “మోనిష ఎన్ మోనాలీసా” అనే తమిళ చిత్రం ద్వారా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చింది.

ఈ అమ్మడి అందం, అభినయం చూసిన దర్శకనిర్మాతలు ఈమెకు ఎక్కువగా బోల్డ్ ,వ్యాంప్ తరహా పాత్రలకు మాత్రమే ఛాన్స్ ఇవ్వడంతో చివరికి హీరోయిన్ గా రాణించాలనే కోర్కె తీరలేదు. ఐటెం సాంగ్స్ కి పరిమితమైంది. మహా అయితే సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా అక్కడ కూడా బోల్డ్ గా కనిపించే సీన్స్ ఉండేవి. ఆమె అదృష్టమో, దురదృష్టమో తెలియదుగానీ, స్పెషల్ సాంగ్స్ ఎక్కువ రావడంతో కెరీర్ కోసం అలాంటి పాత్రలలోనే చేయాల్సి వచ్చింది.

ఇక ముంతాజ్ నటిగా మాత్రమే కాదు, పలు చిత్రాలకి సహ నిర్మాతగా కూడా ఉంది. పాపం, ఇక్కడ కూడా ఈ అమ్మడికి అదృష్టం కల్సి రాలేదు. ఆ మధ్య తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఆగడు మూవీలో విలన్ కి లవర్ గా ముంతాజ్ నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్స్ లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ముంతాజ్ ప్రస్తుతం తమిళంలో వలైయన్ మూవీలో ప్రాధాన్యత గల పాత్ర చేస్తోందట.