MoviesTollywood news in telugu

సీమ సింహం సినిమా డిజాస్టర్ కావటానికి కారణాలు ఇవేనట

Seema Simham Movie Songs :టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు, నటులూ ఉన్నా కొందరికి మాత్రమే తమ వాయిస్ ద్వారా గుర్తింపు లభిస్తుంది. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్ , కొంగర జగ్గయ్య , రంగనాథ్, మోహన్ బాబు, సాయికుమార్ ఇలా కొందరు మాత్రమే తమ వాయిస్ తో జనాన్ని కట్టిపడేస్తారు. సాయికుమార్ డైలాగ్ డెలివరీకి ఇప్పటికీ ఎందరో చప్పట్లు కొడుతు న్నారు. కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సాయికుమార్ ‘సీమసింహం’ సినిమాలో బాలకృష్ణకి ధీటైన విలన్ గా నటించాడు. సాయికుమార్ క్రేజ్ కూడా అప్పటికే విపరీతంగా పెరిగిపోవడంతో హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆ పాత్రను డిజైన్ చేశారట.

డైలాగ్ కింగ్ గా ఫాన్స్ మనసులను దోచుకున్న సాయికుమార్ గురించి ‘పరుచూరి పలుకులు’ కార్యక్రమంలో నటుడు,రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కీలక అంశాన్ని ప్రస్తావించారు. బాలకృష్ణ కూడా తన పాత్రతో సమానంగా సాయికుమార్ పాత్ర ఉండాలని చెప్పాడని, అయితే సాయికుమార్ కి గల పాజిటివ్ ఇమేజ్ వలన విలన్ గా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదని గోపాలకృష్ణ చెప్పారు. అయితే ‘నరసింహనాయుడు’ కోసం ముందుగా అనుకుని ఆ తరువాత పక్కన పెట్టేసిన సెకండాఫ్ ను ఈ సినిమా కోసం తీసుకోవడం, బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ లోపాలు, విలన్ గా సాయికుమార్ ను తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ సినిమా డిజాస్టర్ కి కారణంగా చెప్పుకొచ్చారు.

నిజానికి సాయికుమార్ కుటుంబంతో మొదటినుంచి తమకు మంచి అనుబంధం ఉందని ఆ కుటుంబంలోని పిజె శర్మ తో సహా అందరితో కలిసి పనిచేశామని గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యంగా సాయికుమార్ కి కర్తవ్యం, మదరిండియా, సర్పయాగం వంటి సినిమాల్లో తన పాత్రలను ఆయన అద్భుతంగా చేశాడని వివరించారు. మొత్తానికి ఒకవైపు పాజిటివ్ పాత్రలు, మరో వైపు నెగెటివ్ పాత్రలను చేస్తూ మెప్పిస్తూ వచ్చాడు. ఆ తరువాత ‘పోలీస్ స్టోరీ’తో హీరోగా చేసిన సాయికుమార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడలో ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."