MoviesTollywood news in telugu

టాలీవుడ్ హీరోల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమిటో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

Tollywood Heros Dream Projects :కరోనా తర్వాత తెలుగులో చిన్న హీరోలతో పాటు టాప్ హీరోలందరూ తమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ల హీరో దగ్గర్నుంచి ఫలానా సినిమా చేస్తే బాగుంటుందని ఆశిస్తారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కోబలి అనే మూవీని గతంలో ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొలిటికల్ గా బిజీగా ఉండడంవల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఎప్పటికైనా ఆ సినిమాని పవన్ కళ్యాణ్ తోనే తీస్తానని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సమయంలో తన మనసులోని మాట చెప్పడంతో, ఆ సినిమా ఎప్పుడా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జేమ్స్ బాండ్ మూవీస్ కి పెట్టింది పేరు. అయితే అయన తనయుడు మహేష్ బాబుకి కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమా రావాలని ఫాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. అయితే ఎక్కడో తేడా కొడుతోంది. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు భక్తకన్నప్ప సినిమా అప్పట్లో బాపు డైరెక్షన్ లో తెరకెక్కి సంచలన విజయం నమోదుచేసింది. ఇదే సినిమా ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు చూస్తున్నా,ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలను బట్టి భక్త కన్నప్ప ఎప్పటికి తెరకెక్కుతుందో అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

బాహుబలి తో తన స్టామినా మాత్రమే కాదు, తెలుగు ఇండస్ట్రీ ఘనత చాటిన దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పటికైనా తన కెరియర్ లో మహాభారతాన్ని తీస్తానని ఇప్పటికే చాలా సార్లు చెప్పినా, ఇప్పటికీ క్లారిటీ లేదు. మహాభారతం లాంటి చాలా పెద్ద స్టోరీ చేయాలంటే ఇప్పట్లో కష్టమే. అందుకే తన చివరి సినిమాగా మహాభారతాన్ని తీస్తానని జక్కన్న ప్రకటించాల్సి వచ్చింది. పోకిరి, బిజినెస్ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని మహేష్ బాబు కి అందించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ జనగణమణ సినిమా చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాకానీ మహేష్ బాబు దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఎప్పటికి నెరవేరుతుందోనని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఒకప్పుడు పౌరాణిక పాత్రలకు కేరాఫ్ ఎడ్రెస్ ఎన్టీఆర్. ఆయన త్రిపాత్రాభినయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తీసిన దానవీరశూరకర్ణ సినిమా అప్పట్లో ఓ సెన్షేషన్. అయితే ఇదే మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్. అయితే రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నా, చెర్రీకి ఖాళీలేక ఇంకా ఎప్పుడొస్తుందో చెప్పలేం. అయితే ఈ సినిమా కోసం మెగాస్టార్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.