MoviesTollywood news in telugu

2015 లో చనిపోయిన టాలీవుడ్ సెలబ్రేటీస్…ఎంత మంది ఉన్నారో…!?

2015 Tollywood Actors Died :ఇండస్ట్రీలో చాలామంది గతించారు. ఇందులో కొందరు వయస్సు మళ్లినవాళ్లతో పాటు వివిధ కారణాల వలన మరణించిన వాళ్ళున్నారు. అయితే 2015లో చాలామంది ఇండస్ట్రీ కోల్పోయింది. జనవరి 4న కేన్సర్ తో ఆహుతి ప్రసాద్ చనిపోయారు. ఆహుతి సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మొదట్లో విలన్ గా మెప్పించి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా కమెడియన్ గా చందమామ, బెండు అప్పారావు వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆహుతి ప్రసాద్ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. అమర్నాడే అంటే జనవరి 5న సీనియర్ రచయిత గణేష్ పాత్రో కేన్సర్ తో పోరాడుతూ మరణించారు.

నిర్మాతగా, దర్శకునిగా రాణించిన జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత రాజేంద్రప్రసాద్ జనవరి 12న మరణించారు. ఈయన జగపతిబాబు తండ్రి. అక్కినేని కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీ దసరా బుల్లుడుకి దర్శక నిర్మాత గా రాజేంద్రప్రసాద్ వ్యవహరించారు. ఇక మూవీ మొఘల్ గా అన్ని భాషల్లో సినిమాలు తీసి గిన్నీస్ బుక్ ఎక్కిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఫిబ్రవరి 18న అనారోగ్యంతో కన్నుమూశారు. దాదాపు 150సినిమాలు నిర్మించి ఎందరినో సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. సినిమాటోగ్రాఫర్ విన్సెన్ట్ కూడా 86ఏళ్ల వయస్సులో ఫిబ్రవరి 25న మరణించారు.

నేషనల్ విన్నింగ్ ఎడిటర్ టీఈ కిషోర్ మార్చి 6న 32ఏళ్ల వయస్సులో బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఏప్రియల్ 18న ఈలోకం విడిచారు. గాయం, సింధూరం, ఆవిడా మా ఆవిడే వంటి సినిమాలకు సంగీతం అందించారు. ఎటకారం డాట్ కామ్ మూవీ కొరియోగ్రాఫర్ విజయ్ షూటింగ్ పూర్తిచేసుకుని వస్తున్న సమయంలో స్వల్ప భూకంపం వలన కారు ఏక్సిడెంట్ లో చనిపోయారు. సౌండ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డి ఏప్రిల్ 20న హార్ట్ ఎటాక్ తో మరణించారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అగర్వాల్ సర్జరీ ఫెయిల్ కావడంతో కన్నుమూశారు.

1700కి పైగా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ఎం ఎస్ విశ్వనాథన్ 87ఏళ్ల వయస్సులో జులై 14న కన్నుమూశారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సీతాకోక చిలుక వంటి సినిమాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు, అలాగే నటుడు మాడా వెంకటేశ్వరరావు, కమెడియన్స్ కళ్ళు చిదంబరం, కొండవలస లక్ష్మణరావు, దేవిశ్రీ ప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి , థియేటర్ ఆర్టిస్టు చాట్ల శ్రీరాములు, సీనియర్ నటుడు రంగనాధ్ కూడా ఈ ఏడాది మరణించారు. అప్ కమింగ్ యాక్టర్ ప్రశాంత్ లవ్ ఎఫైర్ వలన మేడమీది నుంచి దూకి నవంబర్ 13న ఆత్మహత్య చేసుకున్నాడు. టాప్ కమెడియన్ M.S.నారాయణ జనవరి 23 న మరణించారు.