MoviesTollywood news in telugu

పెదరాయుడు తర్వాత రజనీ, మోహన్ బాబు కలిసి ఎందుకు నటించలేదో…?

Mohan Babu And Rajnikanth :ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరొందిన మోహన్ బాబుకి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి స్నేహితుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పెదరాయుడు అఖండ విజయాన్ని అందుకుంది. కానీ తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో మూవీ రాలేదు. దీనికి కారణం ఏమిటనే వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. నిజానికి మోహన్ బాబు వరుస పరాజయాల సమయంలో చేయూత నిచ్చేందుకు పెదరాయుడు మూవీలో రజనీకాంత్ నటించాడు.

స్వయంగా తమిళ రీమేక్ హక్కులు కొని, మరీ మోహన్ బాబుచేత ఈ సినిమా తీయించింది రజనీయే. అంతేకాదు, రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా నటించి తన ఫ్రెండ్ మోహన్ బాబుకి రజనీకాంత్ భారీ సాయం అందించారు. పెదరాయుడు అఖండ విజయాన్ని దక్కించుకుంది. అప్పట్లో రజనీకాంత్ పాత్ర గురించి ఎక్కువమంది చర్చించుకున్నారు. అంతలా తన యాక్షన్ తో మెస్మరైజ్ చేసాడు రజనీకాంత్. ఈ సినిమా తర్వాత మరో సినిమా ఇద్దరి కాంబినేషన్ లో తీయాలని భావించారట.

అయితే పెదరాయుడు లాంటి సినిమా అయితే చేద్దామని, ఒకవేళ తేడా కొడితే ఇబ్బంది వస్తుందని మోహన్ బాబు స్వయంగా అనడమే కాదు, ఒకవేళ కథ నచ్చితే మీరే చెప్పండి చేద్దాం అని కూడా అనడంతో రజనీ సరేనన్నారట. అయితే ఇద్దరూ ఎవరి సినిమాల్లో బిజీగా ఉండడం, పేదరాయుడుని బ్రేక్ చేసే కథ రాకపోవడం, మరోవైపు పిల్లలను ఇండస్ట్రీకి తీసుకు వచ్చే క్రమంలో మోహన్ బాబు సినిమాలు తగ్గించుకోవడం వంటి కారణాల వలన రజనీకాంత్ తో ఎం మళ్లీ సినిమా చేసే ఛాన్స్ రాలేదు. అందుకే పెదరాయుడు వీరి కాంబోలో వచ్చిన స్వీట్ మెమరీ గానే ఉంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."