శశి సినిమా హీరోయిన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు
Sashi Movie release Date : కొందరు చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపు పొందుతారు. అలాంటి వాళ్లలో బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మేన్, ఒక్క క్షణం, ఎటాక్, వోటర్ వంటి మూవీస్ లో హీరోయిన్ గా చేసిన సురభిని ప్రముఖంగా ప్రస్తావించాలి. తాజాగా శశి సినిమాలో నటించింది. మార్చి 19న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ అందుకుంది.
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న శశి మూవీలో చంద్రబోస్ రాసిన .. ఒకే ఒక లోకం నువ్వు.. పాటకు ప్రేక్షకుల నుంచి ఇప్పటికే మంచి స్పందనతో పాటు వ్యూస్ కూడా వచ్చాయి. ఇక అందం, అభినయంతో అవకాశాలను సొంతం చేసుకుంటున్న సురభి, ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ముఖ్యంగా ఈ సినిమా రొటీన్ లవ్ స్టోరీ కాదని, ఫ్యామిలీ ఆడియన్స్ కి వినోదం పంచె అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని సురభి చెప్పుకొచ్చింది. రియల్ లైఫ్ లో తన పేరెంట్స్ కి ఒకే ఒక్క కూతురిని కావడంతో ఈ మూవీలో పాత్రకు వెంటనే కనెక్ట్ అయ్యానని చెప్పింది. గ్లామర్ రోల్స్ లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఆమె తెగేసి చెప్పేసింది.

