చాలా విచిత్రంగా….నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి…ఎలా జరిగిందో…?
Nag ashwin marriage :తొలిసినిమాతోనే సక్సెస్ అందునా బ్లాక్ బస్టర్ అందుకుంటే ఆ ఆనందం మామూలు రేంజ్ లో ఉండదు. అది హీరో అయినా, హీరోయిన్ అయినా, విలన్ అయినా , దర్శకుడైనా, చివరకు టెక్నీషియన్ అయినా సరే, తొలిసినిమా కిక్కే వేరు. అలా కాకుండా కొన్ని సినిమాలతోనే స్టార్ హోదా తెచ్చుకుంటే, వచ్చే క్రేజ్ వేరు. సరిగ్గా నాగ్ అశ్విన్ విషయంలో అలాగే జరిగింది. ఇతను దర్శకుడిగా సినిమాలు తక్కువే తీసినా స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నాడు. ఇతడి డైరెక్షన్ లో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం ఎబో యావరేజ్ గా నిలిస్తే, కీర్తి సురేష్ ని పెట్టి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
నాగ్ అశ్విన్ తరువాత సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తీయబోతున్నాడు. ఈ ఏడాది సెకండాఫ్ లో ఆ మూవీ విడుదల కానుంది. అయితే ఈలోగా నిర్మాతగా వ్యవహరించిన ‘జాతిరత్నాలు’ సినిమా రిలీజయింది. ఈ మూవీ హిట్ టాక్ తో పాటు వసూళ్లు కూడా తెస్తోంది. ప్రియాంక దత్ ని ప్రేమించి, 2015 లో పెళ్లి చేసుకున్న నాగ్ అశ్విన్.. జాతిరత్నాలు మూవీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి ఆసక్తిగా చెప్పుకొచ్చాడు. వాటి వివరాల్లోకి వెళ్తే, .. నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ కొన్ని యాడ్స్ కోసం పని చేస్తున్న సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దాంతో నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రమణ్యం సినిమాను ప్రియాంక దత్ నిర్మించింది
ప్రియాంక దత్ కు ఆమె పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ‘ఎవరైనా నచ్చితే ఓకే’… లేకుంటే మనం పెళ్లి చేసుకుందామా’ అని ప్రియాంకకు నాగ్ అశ్విన్ ప్రతిపాదన చేసాడు. నాగ్ అశ్విన్ మంచి వ్యక్తి కావడం, అతని టాలెంట్ పై అపారమైన నమ్మకం ఉండటంతో ప్రియాంక వెంటనే ఓకే అనేసింది. అలా నాగ్ అశ్విన్ ప్రేమ, పెళ్లి జరిగాయి. ఆ తరువాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మహానటి సినిమా సక్సెస్ కావడం, అవార్డులు రావడంతో ప్రియాంక అడుగుపెట్టిన వేళావిశేషం అని టాక్. ఎందుకంటే, దర్శకుడిగా ప్రూవ్ చేసుకోక ముందే ప్రియాంకని వివాహం చేసుకున్నాడు.

