MoviesTollywood news in telugu

సౌందర్య, మోహన్ బాబు కాంబోలో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో…!?

Mohan Babu And Soundarya :కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సౌందర్య జంటగా నటించిన పెదరాయుడు అఖండ విజయాన్ని అందుకుంది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. 1994లో వచ్చిన ఈ మూవీలో ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా రజనీకాంత్ ఓ స్పెషల్ పాత్రవేసి అదరగొట్టాడు. ఇక మోహన్ బాబు, సౌందర్య కాంబినేషన్స్ లో వచ్చిన మూవీస్ కొన్ని విజయం దక్కించుకోగా కొన్ని ప్లాప్ అయ్యాయి.

ఇక 1998లో రాయుడు మూవీలో మోహన్ బాబు , సౌందర్య కల్సి నటించారు. సినిమా పెద్దగా ఆడలేదు గానీ, టీవీల్లో బాగానే ఆదరణకు నోచుకుంది. శ్రీరాములయ్య మూవీలో మోహన్ బాబు సరసన సౌందర్య నటించింది. ఇది బెస్ట్ మూవీగా నిల్చింది. 1999లో వచ్చిన ఈ మూవీలో నందమూరి హరికృష్ణ కీలక పాత్రలో నటించి మెప్పించారు. అలాగే పోస్ట్ మ్యాన్ మూవీలో మోహన్ బాబు సరసన నటించిన సౌందర్య కంటతడి పెట్టించే పాత్ర లో జీవించింది. రాశి మరో ప్రధాన పాత్ర వేసింది.

1999లో ముప్పలనేని శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. 2001లో వచ్చిన అధిపతి మూవీలో మోహన్ బాబు , సౌందర్య కల్సి నటించారు. ఇక దర్శక రత్న దాసరి దర్శకత్వం వహించిన కొండవీటి సింహాసనం మూవీలో మోహన్ బాబు, సౌందర్య కల్సి నటించారు. ఇది డిజాస్టర్ అయింది. వీరిద్దరి కాంబోలో చివరి మూవీ శివశంకర్. నటన పరంగా బాగున్నా సినిమా డిజాస్టర్ అయింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."